భారత్ సమాచార్, హైదరాబాద్ ; రామ్, మాయ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫైటర్ రాజా’. ఈ మూవీ టీజర్ ను నేడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నేడు భాగ్యనగరంలో జరిగిన ఈవెంట్ లో విడుదల చేశారు. టీజర్ చాలా బాగుందని, మూవీ టీం మంచి వర్క్ చేసినట్టు కనిపిస్తోందని, యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు విశ్వక్ అన్నాడు. ప్రచార చిత్రం ఆసాంతం చాలా ఆసక్తికరంగా సాగింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా చిత్రం రూపొందింది. ‘మన దగ్గర ఏదైన కొనేంత డబ్బైనా ఉండాలీ, లేదా డబ్బు కుడా కొనలేని పవర్ అన్నా ఉండాలి ’ అనే డైలాగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. కృష్ణ ప్రసాద్ దర్శకుడు. దినేష్ యాదవ్ నిర్మాత. స్మరణ్ సాయి సంగీతం సమకూర్చాడు. టీజర్ లోని బీజీఎం బాగుంది.
మరి కొన్ని సినీ విశేషాలు…