భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఎక్కడపడితే అక్కడ.. ఏదిపడితే అది తింటే అనారోగ్యం బారినపడడం ఖాయం. ఇప్పుడు అలానే ఉన్నాయి పరిస్థితులు మరి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్, సెంటర్లు, బేకరీలు ఇలా ఎక్కడ చూసినా నాణ్యత లేని (Quality less Food) ఆహారమే దర్శనమిస్తోంది. అంతే కాదు గడువు ముగిసిన నిత్యావసర సరుకులు.. రోజుల తరబడి ఆహార పదర్థాలు నిల్వ ఉంచే ప్రమాదకరమైన పదార్థులు వాడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad)లోని రెస్టారెంట్లు, హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడంతో వారి బాగోతాలు బట్టబయలు అవుతున్నాయి.
తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (Gachibowli)లో పలు హోటళ్లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో బయటపడ్డ విజువల్స్ చూస్తే ఒక్కొక్కరికి వాంతులు రావడం పక్కా అని చెప్పాలి. గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ (DLF) గేట్ నంబర్3 వద్ద సిప్ అండ్ స్నాక్ (𝗦𝗶𝗽 𝗮𝗻𝗱 𝗦𝗻𝗮𝗰𝗸) అనే జ్యూస్ షాప్‌లో అధికారులు రైడ్స్ చేశారు. అందులో.. రిఫ్రిజిరేటర్‌లోని ఆహార పదార్థాలను కవర్ చేయకుండా పెట్టారు. అంతేకాకుండా సపోటాలు, నారింజ వంటి కొన్ని పండ్లు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇక అదే ఏరియాలో బిస్మీ మ్యాగీ అండ్ జ్యూస్ సెంటర్ (𝗕𝗶𝘀𝗺𝗶 𝗠𝗮𝗴𝗴𝗶 𝗮𝗻𝗱 𝗝𝘂𝗶𝗰𝗲 𝗖𝗲𝗻𝘁𝗿𝗲)లో దాదాపుగా ఇదే పరిస్థితి. పేస్ట్ కంట్రోల్ రికార్డ్స్, ఎంప్లాయ్ హెల్త్ రికార్డ్స్, వాటర్ ఎనాలసిస్ రిపోర్ట్స్ అందుబాటులో లేవని తెలిపారు.
అలాగే డిఎల్ఎఫ్‌లోని గేట్ నంబర్ 2లోని మిలన్ జ్యూస్ సెంటర్ (𝗠𝗶𝗹𝗮𝗻 𝗝𝘂𝗶𝗰𝗲 𝗖𝗲𝗻𝘁𝗿𝗲)లోనూ తనిఖీలు చేశారు అధికారులు. అందులో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. లోపల ఆహార పదార్థాలు నేలపై ఎలా పడితే అలా ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది ఎలాంటి అప్రాన్‌లు, చేతి గ్లౌజ్‌లు లేకుండా ఉన్నట్లు తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని రెస్టారెంట్లల్లో ఫుడ్ తినాలంటే జనం జంకుతున్నారు. పొరపాటున బయట పుడ్ తింటే అనారోగ్యం ఖాయం అనట్లు ఉంది పరిస్థితి.