Homemain slidesమాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పులు...

మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పులు…

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక బులెట్ ఆయన చెవిని తాకింది. వెంటనే ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమై మాజీ ప్రెసిడెంట్ ను ప్రాణాపాయం నుంచి తప్పించారు. దీంతో గాయాలపాలైన ట్రంప్ ను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు.

పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్

గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దుండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం. మరోవైపు ట్రంప్పై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

కాల్పుల పై.. బైడెన్, ఒబామా ఏమన్నారంటే?

అమెరికాలో హింసకు తావులేదని ప్రెసిడెంట్ జో బెడెన్ ట్వీట్ చేశారు. ‘కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒక్కటై ఈ ఘటనను ఖండించాలి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

హెల్త్ అప్డేట్

ఎన్నికల ర్యాలీలో దుండగుడి కాల్పులలో గాయాలపాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్య వాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ఎన్నికల్లో సానుభూతి కోసమే ట్రంప్ పై దాడి జరిగిందని కొందరు రాజకీయ ప్రత్యర్థులు పెదవి విరుస్తున్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

అమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

Recent Comments