Homebreaking updates newsఅమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్ట్

అమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్ట్

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగు వారిని అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఒక ఇంటిలో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది కంటే ఎక్కువ మంది యువతులను ప్రిన్‌స్టన్ పోలీసులు వారిని అరెస్టు చేసే సమయంలో అక్కడ కనుగొన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు భాగమై ఉంటారని, వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని కూడా అతి తొందరలోనే గుర్తిస్తామని వారు వెల్లడించారు.

హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న తెలుగు వ్యక్తులు చందన్ దసిరెడ్డి (24), ద్వారక గుండా (31), సంతోష్ కట్కూరి (31), మరియు అనిల్ మాలే (37) అనే వ్యక్తులను ప్రిన్‌స్టన్ పోలీసులు అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వీరు ఎప్పటి నుంచి ఈ క్రైమ్ ని నిర్వహిస్తున్నారు, ఇందులో బాధితులు ఎక్కడి వారు అనే వివరాలు త్వరలోనే తెలియజేస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరి కొన్ని తాజా వార్తా విశేషాలు మీ కోసం…

విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments