Homemain slides2012 లండన్ ఒలింపిక్స్ లో ‘నైతిక విలువలు’

2012 లండన్ ఒలింపిక్స్ లో ‘నైతిక విలువలు’

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

తుపాకీ తూటా పేలింది… కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలవబోతున్నాడు. ముందు గీతను చూసి అదే రేసు చరమ గీత అనుకుని అక్కడే ఆగిపోయాడు. ఆ అథ్లెటిక్ కి భాష రాదు, కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు.

తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ…

జర్నలిస్టు : ” మీరు అలా ఎందుకు చేశారు ”

ఇవాన్ ఫెర్నాండెజ్ : ఏదో ఒకరోజు మనం ఒకళ్లకి ఒకళ్లు సహాయం చేసుకుంటూ అందరం గెలిచే సమాజం కోసం అలా చేశాను. ”

జ: మీరు ఆ కెన్యా రన్నర్ కు మీకు రావలసిన బంగారు పతకం ధార పోశారు తెలుసా ?

ఇవాన్ : నేనేం అతనికి సహాయం చేయలేదు. ఈ రేసు అతనే గెలవబోతున్నాడు. కేవలం భాష రాకపోవటం వలన ఆయన ముందే ఆగాడు.

జ: కానీ మీరు గెలిచేవారే కదా !

ఇవాన్ : అవును. బంగారు పతకం గెలిచేవాడినే. కానీ ఆ బంగారు పతకానికి అప్పుడు ఏమి విలువ ఉంటుంది.

జ : మీరు బంగారు పతకాన్ని గెలిచేవారే కదా ?

ఇవాన్ : ఆ గెలుపుకు విలువేమున్నది ? నా తల్లి నా గురించి ఏమనుకుంటుంది ? మానవీయ విలువలు ఒక తరం నుండి మరో తరానికి పెరుగుతూ అందింపబడాలి. మన పిల్లలకు మనం అదే నేర్పాలి. మన పిల్లలకు మనం సరైన మార్గంలో వెళ్ళడం నేర్పాలి. తప్పు మార్గంలో వెళ్ళి గెలవడం మన పిల్లలకు నేర్పకూడదు. అలా కాకుండా మానవీయ విలువలు పెంచుతూ ఒకరికొకరం సహాయ పడుతూ పురోగమించాలి. ఎందుకంటే నిజాయితీ, నైతిక విలువలే ఎప్పుడూ విజయం సాధిస్తాయి.

2024 పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో అప్పట్లో హైలెట్ గా నిలిచిన ఈ వార్త ఇప్పుడు మళ్లీ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతూ ఉంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

పారిస్ ఒలింపిక్స్ కు భారత క్రీడా సైన్యం

RELATED ARTICLES

Most Popular

Recent Comments