Homemain slidesరాష్ట్ర రాజధానిలో యువతిపై గ్యాంగ్ రేప్

రాష్ట్ర రాజధానిలో యువతిపై గ్యాంగ్ రేప్

భారత్ సమాచార్,హైదరాబాద్ ;

హైటెక్ సిటీ కి అడ్రస్ గా నిలిచిన రాజధాని..ఇప్పుడు మహిళల రోధనలకు కూడా నిలయంగా మారుతోంది. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల కబంధ హస్తాల్లో మరో యువతి బలైంది. సైట్ విజిట్ పేరుతో సహోద్యుగులు యువతిని కారులో తీసుకెళ్లారు. సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు యువతిని కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఎట్టకేలకు దుర్మార్గులనుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.

కడప నుంచి జాబ్‌ కోసం వచ్చిన యువతి… బాధితురాలి వివరాల ప్రకారం.. కడప నుంచి జాబ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మియాపూర్‌ జేఎస్ఆర్ గ్రూప్స్‌ సన్‌ సిటీ రియల్ ఎస్టేట్‌ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న యువకులు.. సైట్ విజిట్ పేరుతో కారులో తీసుకెళ్లి దాదాపు నాలుగు గంటలపాలు కారులో తిప్పులూ లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆమె ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నిందుతుల్లో ఒకడైన జనార్ధన్ తోపాటు ఇతరుల నుంచి తప్పించుకుని అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

ఇది వేరే లెవల్ హైడ్రామా

RELATED ARTICLES

Most Popular

Recent Comments