భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తల్లి మందలించిందని బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని న్యూబోయిగూడలో చోటుచేసుకుంది. మనోవేదనకు గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. న్యూబోయిగూడలో నివాసం ఉండే అబ్దుల్‌రజాక్‌కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు. చిన్నకుమార్తె జియా ఫాతిమా(13) మదర్సాలో చదువుకుంటోంది. మూడురోజుల క్రితం బన్సీలాల్‌పేటకు వెళ్లి స్నేహితులతో ఆడుకొని ఇంటికి వచ్చింది. అంత దూరం వెళ్లినందుకు ఫాతిమాను తల్లి మందలించింది. అప్పటి నుంచి తల్లితో మాట్లాడకుండా, స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది.
బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య:
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బద్దలుకొట్టి చూడగా ఫాతిమా వేలాడుతూ కనిపించింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గాంధీనగర్ ఎస్‌ఐ నాగరాజు రెడ్డి తెలిపారు.
మరిన్ని కథనాలు: