Homebreaking updates newsఘనంగా APRO సుభాష్ వివాహం

ఘనంగా APRO సుభాష్ వివాహం

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా : సీనియర్ జర్నలిస్ట్, వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (APRO), మాజీ ఈనాడు సబ్ ఎడిటర్, మాజీ వ్యూహకర్త సుగురు సుభాష్ వివాహ వేడుకలు బుధవారం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం వనపర్తి సంఘం ఫంక్షన్ హల్ లో ఈ కళ్యాణ వేడుకల్ని బంధు, మిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు పాత్రికేయ మిత్రులు యంజాల ధనకుమార్, ఎస్ ఎస్ రాజా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై వధూవరులను ఆశీర్వదించి తమ శుభాకాంక్షలు తెలిపారు. తమకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రత్యేకంగా వివాహ వేడుకకు హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారికి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుభాష్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలోనే ఈనాడు పెళ్లిపందిరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు తమ పేరును పెళ్లి పందిరిలో నమోదు చేసుకున్నారు.

మరికొన్ని కథనాలు…

ఘనంగా రైల్వేఉద్యోగి కోటేశ్వరరావు వివాహం

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments