Homemain slidesGujarat Titans: టాప్ లో టైటాన్స్.. వరుసగా నాలుగో విజయం..!

Gujarat Titans: టాప్ లో టైటాన్స్.. వరుసగా నాలుగో విజయం..!

భారత్ సమాచార్.నెట్, అహ్మదాబాద్: ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. జట్టు విజయంలో ఓపెనర్ సాయి సుదర్శన్ (82) కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా వచ్చిన అతను 19వ ఓవర్ వరకూ క్రీజులో పాతుకపోయాడు. అతని నిలకడైన ఇన్నింగ్స్‌తో పాటు బట్లర్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్ కీలక సమయంలో పరుగులు జోడించడంతో గుజరాత్ 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆరంభంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయినా, సుదర్శన్ ఆధారంగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అతను 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, బట్లర్ (36) మరియు షారుఖ్ ఖాన్ (36) విలువైన భాగస్వామ్యాలు కల్పించారు. చివర్లో తెవాటియా (24 నాటౌట్) మరియు రషీద్ ఖాన్ (12) పర్యాప్తంగా పరుగులు సాధించడంతో స్కోరు 217/6గా నిలిచింది.

రాజస్థాన్ భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించగా, గుజరాత్ బౌలర్లు దుమ్ముదులిపారు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, సాయి కిశోర్ తల తల రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ను బెంబేలెత్తించారు. రాజస్థాన్ బ్యాటింగ్‌లో హెట్మేయర్ (52) ఒక్కడే కొంత పోరాడినప్పటికీ, అతనికి మద్దతుగా ఎవరూ నిలవలేదు. కెప్టెన్ సంజూ శాంసన్ (41) మరియు రియాన్ పరాగ్ (26) కొంత ప్రదర్శన చూపినప్పటికీ అది విజయానికి సరిపోలేదు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో గుజరాత్ ఐపీఎల్ 2025లో తన స్థానం మరింత బలంగా నిలబెట్టుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments