భారత్ సమాచార్, సినీ టాక్స్ : నేషనల్ క్రష్ రష్మిక.. ఈమె తాజాగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఆమె స్టార్ డమ్ మరింత పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో కూడా గట్టిగా తన జెండా ఎగురేస్తోంది. పుష్ప తో ఓ రేంజ్ లో పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మ హవా నడుస్తోంది. తాజాగా యానిమల్ మూవీతో బాలీవుడ్ జనాలను బాగా ఆకర్షించింది. ఇక ఈ కన్నడ బ్యూటీ కూడా రెగ్యులర్ గా బాలీవుడ్ లో నటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆమె ఇంటికి బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఆమెను ఇన్ స్టా లో 4 కోట్ల మంది ఫాలో కావడం రష్మిక పాపులారిటీ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో రష్మిక టాపిక్ వచ్చింది. ఈ షో కు వచ్చిన ప్రమోద్ అనే వ్యక్తి ఆమెపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను రష్మికకు పెద్ద ఫ్యాన్. 2016లో ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. నాకంటే పెద్ద అభిమాని ఎవరూ ఉండరు. సోషల్ మీడియాలో నా మెసేజ్ కు ఆమె మూడు సార్లు రిప్లై కూడా ఇచ్చింది. ఆమెకు పెళ్లి ప్రపోజల్ కూడా పంపాను..’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అమితాబ్ ఓ నవ్వు నవ్వారు. వెంటనే రష్మికకు ఫోన్ చేసి మాట్లాడారు..‘‘ యానిమల్ మూవీని చూశాను. మీ నటన బాగా నచ్చింది. మీకు అంతా శుభం కలగాలి’’ అని దీవించారు.