భారత్ సమాచార్, గుంటూరు ;
కరోనా దెబ్బకు రోడ్డున పడ్డ చిరు వీధి వ్యాపారులు ఎందరో ఉన్నారు.అటువంటి వారిలో గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఒకరు. ఆయనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారు. కరోనా మిగిల్చిన వ్యాపార నష్టాల్ని, అప్పుల్నికట్టేందుకు ఇక వేరే దిక్కు లేక ఆటో నడుపుకుంటు జీవితం సాగించారు. ఈ క్రమంలోనే చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సతమతం అయ్యాడు. అప్పటి నుండి రెండేళ్ల పాటు అప్పులు తీర్చటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఏడాది చివర్లో ఒకరిచ్చిన సలహాతో కిడ్నీ అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సమయంలోనే బాషా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్ బుక్ లో ఉన్న యాప్స్ ద్వారా కిడ్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా కిడ్ని అమ్ముకున్నట్లు చెప్పి అతడిని నమ్మించాడు. దీంతో మధుబాబు ఫేస్ బుక్ లోకి యాప్స్ ద్వారా కిడ్ని అమ్మేందుకు సిద్దం అయ్యాడు. అప్పుడే బాషా ద్వారా వెంకట్ అనే మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన వారికి కిడ్నీ ఇస్తే ముప్పై లక్షలు ఇస్తానని ముందుగా మాట్లాడుకున్నారు. దీంతో మధుబాబు కిడ్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. మధుబాబు పేరు మీద ఉన్న రికార్డులన్నింటిని వెంకట్ మార్చేశాడు. అప్పటి నుండి నెలవారి ఖర్చుల కింద కొత్త మొత్తాన్ని ఇచ్చారు. గత నెల పదిహేనో తేదిన విజయవాడలోని విజయా సూపర్ స్పెషాటిలీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు.
అయితే అప్పటి వరకూ అతనికి మొత్తం లక్షా పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కొద్దీగా కొలుకున్న తర్వాత మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ వెంకట్ అడగటం మొదలు పెట్టాడు. అయితే రక్త సంబంధీకుడుగానే కిడ్ని ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ వెంకట్ రివర్స్ గేర్ వేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మధుబాబు నేడు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఇంకొకరు ఈ విధంగా మోసపోకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు.
మరికొన్ని తాజా వార్తా విశేషాలు…