Homemain slidesగ్రూప్-1 అభ్యర్థులతో హైకోర్టు ఆటలు

గ్రూప్-1 అభ్యర్థులతో హైకోర్టు ఆటలు

భారత్ సమాచార్, తెలంగాణ: గ్రూప్- 1 పరీక్ష విషయంలో హైకోర్టు తీరు అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తుంది. గ్రూప్‌-1 పరీక్షలకు సంబంధించిన కీపై అభ్యంతరాలు స్వీకరించామని TGPSC హైకోర్టు కి నివేదించింది. ఆయా సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపి.. వారు ఆమోదించిన తరువాతే ఫలితాలు విడుదల చేసినట్టు వెల్లడించింది. అయితే.. త్వరలో మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని, ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని TGPSC పేర్కొంది.

గ్రూప్‌-1.. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ.. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కార్తీక్‌ పిటిషన్లపై విచారణ చేపట్టారు. పరీక్షలు రాసిన 3లక్షల మంది నుంచి ప్రిలిమ్స్‌ కీపై భౌతికంగా 721, ఆన్‌లైన్ ద్వారా 6,470 అభ్యంతరాలను స్వీకరించినట్లు TGPSC తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీ పరిశీలించిందని, ప్రధానంగా ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుని కమిటీ సిపారసుల మేరకు రెండు ప్రశ్నలను తొలగించి కీని విడుదల చేశామని తెలిపారు.

అయితే.. పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురిలో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేశారని, మిగిలినవారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అదికారం కమిషన్‌కు ఉందని తెలిపారు. రెండోసారి నోటిఫికేషన్ జారీని సవాలు చేసిన అభ్యర్థితోపాటు, కీని సవాలు చేసిన పిటిషనర్లలో ముగ్గురు మెయిన్‌కు అర్హత సాధించారన్నారని పేర్కొన్నారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులైనట్టు కాదన్నారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని ఈ పిటిషన్లను కొట్టియాలని కోరారు. వాదనలు పూర్తికాకపోవడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే TGPSC పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ప్రిలిమనరీలో తప్పుడు ప్రశ్నలను తొలగించి మెరిట్ జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే 7 వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే రిజల్ట్ ఇచ్చామని TGPSC కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈనెల 21న మెయిన్స్ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

అయితే 2022 నుంచి గ్రూప్- 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా హైకోర్టు కూడా వారికి క్లారిటీ ఇవ్వలేదు. చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు అసలు ఆ కేసులు సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా తెలియని సందిగ్ధంలో ప్రిపరేషన్ కొనసాగించలేక మానసికంగా చాలా ఇబ్బందికి గురయ్యారు. అసలు మెయిన్స్ పరీక్ష జరుగుతుందా లేదా.. ఒకవేళ జరిగితే ఇది సక్సెస్ అవుతుందా లేక 2011 ఏపీపీఎస్సీ గ్రూప్ -1 లాగా మళ్లీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందా, నోటిఫికేషన్ క్యాన్సల్ అవుతుందా, అని విషయంపై వాదనలు విన్న హైకోర్టు కూడా ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని వారు ఆందోళనకు గురయ్యారు. కోర్టు కేసుల వల్ల అభ్యర్థులు గందరగోళానికి గురై మానసిక వేదనకు లోనవుతున్నారు. సెప్టెంబర్ 27 నుంచి, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, అక్టోబర్ 3.. ఇలా హైకోర్టు వేస్తున్న వాదనలను వింటూ ఏదో జరుగుతుందన్న ఆందోళనతో అభ్యర్థులు చదువుపై ఏకాగ్రతను కోల్పోతున్నారు. వారి మానసిక పరిస్థితి సరిగా లేక ఫోకస్ పెట్టడం లేదని చెప్పాలి. అయితే.. ఇవ్వాళ తెలంగాణ హైకోర్టు తీర్పును అక్టోబర్ 14 కు రిజర్వు చేసింది. మరి కొద్దిరోజుల్లో ఎగ్జామ్ జరగనుంది. హైకోర్టు కూడా తమ కష్టానికి సరైన గుర్తింపు ఇవ్వకపోతే తమ కష్టాన్ని అర్థం చేసుకోకపోతే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన హైకోర్టు కూడా 10 రోజులు వాయిదా వేయడం అనేది వివాదాస్పదంగా మారింది. మరి కొద్ది రోజుల్లోనే పరీక్ష ఉందనంగా కోర్టు తీర్పు వాయిదా వేస్తే ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించగలరు అనే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments