Homebreaking updates newsసిల్క్ పాత్రలో ‘హాటీ’ అదుర్స్

సిల్క్ పాత్రలో ‘హాటీ’ అదుర్స్

భారత్ సమాచార్,సినీ టాక్స్ : అలా చూడగానే మత్తు కురిపించే కళ్లు…కుర్రకారు మతులు పొగొట్టే అందంతో అప్పటి జనరేషన్ ను ఒక ఊపు ఊపేసింది ప్రముఖ నటి సిల్క్ స్మిత. హీరోలకు దీటుగ డ్యాన్స్ తో, హస్కీ వాయిస్ తో.. శృంగార తారగా సౌత్ ఇండస్ట్రీని ఏలిన తెలుగు అందం సిల్క్. ఐటం సాంగ్ అని ఇప్పుడు హంగామా చేస్తున్నారని కానీ.. ఇవి మన తెలుగు సినిమాల్లో 40 ఏళ్ల కిందనే స్టార్ట్ అయ్యాయి. ఈ పాటలకు సిల్క్ స్పెషలిస్ట్ యాక్టర్ అనే మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం అంటూ ఖైదీనంబర్ 786 లోనూ, బావలు సయ్యా..అంటూ బావబావమరిదిలోనూ.. ఇలాంటి వేలాది పాటల్లో నటించి అప్పటి యూత్ కు నిద్రలేకుండా చేసింది ఈ సౌత్ ఐటెం సాంగ్ సుందరి. అయితే అర్థంతరంగా ఉరేసుకుని జీవితం చాలించిన ఈ బోల్డ్ బ్యూటీ జీవిత చరిత్ర ఎప్పటికీ ఆసక్తికరమే. అందుకే సిల్క్ జీవితంపై మరో బయోపిక్ ను వెండితెరపైకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే సిల్క్ స్మిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని విద్యాబాలన్ సిల్క్ పాత్రలో నటించిన ‘ ద డర్టీ పిక్చర్’ పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ డూపర్ హిట్టయ్యింది. రీసెంట్ గా సిల్క్ 63వ జయంతి సందర్భంగా ఓ మూవీని ప్రారంభించారు. కాగా, ఈ సినిమాకు ఎస్.బి. విజయ్ వర్మ ప్రొడ్యూసర్ కాగా, జయరాం డైరెక్షన్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రానుంది. దీనిలో సిల్క్ పాత్రను హాట్ బ్యూటీ చంద్రికా రవి పోషిస్తోంది.

హాట్ మోడల్ గా, హీరోయిన్ గా యూత్ ను బాగా అలరిస్తున్న చంద్రికా రవి సిల్క్ పాత్రకు సరిగ్గా సరిపోలుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బ్లాక్ అండ్ కలర్ షేడ్స్ తో సిల్క్ పాత్రలో చంద్రికా లుక్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరికొన్ని కథనాలు…

సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments