భారత్ సమాచార్, అమరావతి : చిలుకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పార్టీలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజాగళం’ సభకి కాకినాడ సిద్ధం సభలో కౌంటర్ ఇస్తామని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని నేడు తెలిపారు. మళ్లీ సీఎం జగన్‌కే ఎందుకు ఓటు వేయాలని మేము కాకినాడలో ప్రజలందరికి వివరిస్తాం. తమకు ఓటు వేస్తే ప్రజలకి ఏం చేస్తారో ప్రజాగళం సభలో కూటమి నాయకులు ఒక్కరు కూడా చెప్పలేదని నాని విమర్శించారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కాకినాడలో చెప్పినట్టు పాచిపోయిన లడ్డూలు, చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయని జనసేన అధినేతను ప్రశ్నించారు. ఐదేళ్ల కింద చంద్రబాబు మోడీని భారీగా తిట్టారు, ఇప్పుడు మళ్లీ మోడీతోనే జత కట్టారు. బాబులో ఈ మార్పుకు కారణం ఏంటో ప్రజలకి చెప్పాలన్నారు. మూడు పార్టీల సభ వెలవెలబోయిందన్నారు. ఈ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అనవసరమన్నారు. రాష్ట్ర ప్రజలకు వారి కూటమికి ఎందుకు ఓటేయాలో చెప్పలేకపోయారు. సభ జరుపుకోవడం చేతకానటువంటివాళ్లకి జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు.
పాచిపోయిన లడ్డూలు తాజాగా ఎలా మారాయి ?
RELATED ARTICLES