భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని బంధానికి తెరపడింది. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని బంధానికి తెరపడింది. ఇక హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. ఏపీకి కేటాయించిన కొన్న భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5 ప్రకారం.. జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణకు 10ఏళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది కేంద్రం. ఆ గడువు పూర్తి కావటంతో తెలంగాణకు ఇక నుంచి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండనుంది. అయితే విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించినప్పటికీ.. అమరావతి కేంద్రంగానే పాలనను కంటిన్యూ చేశారు. ఈ పదేళ్ల కాలంలో పాలన కోసం హైదరాబాద్ లోనూ పలు భవనాలను ఏపీకి కేటాయించారు.
ఏపీని ఆ దేవుడే కాపాడాలి:
హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన కొన్న భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల తర్వాత కూడా కొనసాగించాలనే అంశంపై రాజకీయ పార్టీలు ఏవీ స్పందించలేదని ఎక్స్ వేదికగా జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇక ఆ దేవుడే ఏపీని ఆదుకోవాలని లక్ష్మీ నారాయణ అన్నారు.మరోవైపు మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.