Homebreaking updates newsభవిష్యత్ తరాల కోసమే ‘హైడ్రా’

భవిష్యత్ తరాల కోసమే ‘హైడ్రా’

భారత్ సమాచార్, శాన్ ఫ్రాన్సిస్కో ;

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. నేడు ఆయన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరం అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ కి ప్రసిద్దన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట సిటీలో రాళ్లు కనిపించటం లేదన్నారు. లేక్స్ కబ్జా చేసి ఇళ్లు కొందరు బడా వ్యాపారులు ఇళ్లు కట్టుకున్నారన్నారు. పార్కులు లేకుండా పోయాయన్నారు. లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడే అవకాశం ఉందన్నారు. నది గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేశారన్నారు. వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందన్నారు. అటువంటి పనులు హైదరాబాద్ కి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. పేదవాళ్లను అడ్డంపెట్టి కొంత మంది బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడడం గవర్నమెంట్ బాధ్యతన్నారు. అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని తెలిపారు.

మరికొన్ని వార్తా విశేషాలు

హైడ్రా మరో పెను సంచలనం

RELATED ARTICLES

Most Popular

Recent Comments