భారత్ సమాచార్,సినీ టాక్స్ : కీర్తి సురేశ్.. ఈ మలయాళ అమ్మడు అందం, అభినయంతో విభిన్న పాత్రలు చేస్తూ తన కెరీర్ ను వెండితెరపై స్ట్రాంగ్ గానే ముందుకు తీసుకెళ్తోంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కీర్తికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ‘మహానటి’లో సావిత్రి రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఉత్తమ జాతీయ నటి పురస్కారం కూడా చాలా తక్కువ సమయంలోనే అందుకుంది. తన నటనతో సీనియర్ నటులను సైతం మరిపిస్తోంది కీర్తి. తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి పక్కన సిస్టర్ రోల్ చేసిన ‘బోలా శంకర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన కూడా ఆమె పాత్రకు మాత్రం ప్రేక్షకుల మంచి మార్కులే పడ్డాయి. అలాగే నాని మూవీ ‘దసరా’లో వెన్నెలగా మాస్ రోల్ చేసి ఆడియన్స్ ను ఇంకా బాగా దగ్గరైపోయింది.
సౌత్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించిన కీర్తి సురేష్.. ఇక బాలీవుడ్ లోనూ అడుగుపెట్టి తన సత్తాను చాటనుంది. హిందీ చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేయనున్న ‘అక్క’ వెబ్ సిరీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ మళ్లు బ్యూటీ. ఇది పీరియాడిక్ థ్రిల్లర్ కావడంతో తన నటనతో సత్తా హిందీ ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ సిరీస్ ను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దీనికి ధర్మరాజ్ శెట్టి డైరెక్షన్ చేయనున్నారు. ఈ సిరీస్ లో కీర్తితో పాటు రాధికా ఆప్టే నటించనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సిరీస్ రిహార్సల్స్ ముంబైలో జరుగుతున్నాయి. వాటికి కీర్తి తాజాగా హాజరైంది. ఈ సిరీస్ తన బాలీవుడ్ ప్రయాణం షురూ అయినట్టు సంబరంగా చేప్తోంది. తన పాత్ర పూర్తిగా కొత్తది కావడంతో దాన్ని ఓ సవాల్ గా తీసుకుంటున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ మళయాళీ బ్యూటీ.. ఇక బాలీవుడ్ లోనూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.