Homeక్రైమ్RGV తల నరికి తేస్తే కోటి రూపాయలిస్తా

RGV తల నరికి తేస్తే కోటి రూపాయలిస్తా

భారత్ సమాచార్, సినీ టాక్స్ : రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినపడితేనే దాని వెనక ఓ కాంట్రావర్సీ ఉంటుంది. గతంలో వర్మ అంటేనే ఓ క్రియేటివ్ ఫ్యాక్టరీ. ఆయన నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చేవి. ఓరకంగా ఆయన టాలీవుడ్ ను ఆ తర్వాత బాలీవుడ్ ను షేక్ చేశారు. శివ, క్షణక్షణం, రంగీలా, సత్య, సర్కార్, కంపెనీ, రక్తచరిత్ర.. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్లు ఆయన సొంతం. వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన హీరోలు, టెక్నిషియన్లు వందల్లో ఉంటారు. వీరిలో తెలుగు, హిందీ సినిమాల్లో టాప్ ప్లేసుల్లో ఉన్నారు. వర్మతో అనుబంధాన్ని వారు ఎంతగానో ప్రేమిస్తారు. వర్మ తమకు గురువు అని గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వారిలో పూరీ జగన్నాధ్,కృష్ణవంశీ, తేజ, జేడీ చక్రవర్తి, సందీప్ చౌతా, ఊర్మిళ..ఇంకెందరో ఉన్నారు.

తాజాగా వర్మ ‘వ్యూహం’ కాంట్రావర్సీల్లో ఇరుక్కుంది. అంటే వర్మ కావాలనే ఇలా చేస్తాడనుకోండి. ఇది నవంబర్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్ గా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విజయవాడలో నిర్వహించారు. దానికి అంతంత మాత్రమే ఆదరణ వచ్చింది. ఈనెల 29న రిలీజ్ డేట్ ప్రకటించారు. దీనిపై నారా లోకేశ్ కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టులో విచారణ నడుస్తోంది. ఈక్రమంలో ఈ సినిమాపై టీవీల్లో డిబేట్లు, చర్చలు, పొలిటికల్ కౌంటర్లు, టీడీపీ ఆందోళనలు, వర్మ దిష్టిబొమ్మల దహనం.. ఇలా నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే మంగళవారం ఓ టీవీ చానల్ లో నిర్వహించిన డిబేట్ లో అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వర్మ తల నరికి ఎవరైనా తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. దీనిపై యాంకర్ అలా మాట్లాడవద్దని వెనక్కి తీసుకోవాలని కోరినా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు.. ఐ రిపీట్ అని పదేపదే ప్రకటించారు. దీంతో ఇది మరింత వివాదమై కూర్చుంది. ఇదిలా ఉంటే శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలనే తన ఫిర్యాదుగా తీసుకోవాలని వర్మ ఆ వీడియో బైట్ ను ట్యాగ్ చేసి మరీ పోలీసులకు పంపించాడు.

మరికొన్ని కథనాలు…

సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments