Homemain slidesవీళ్లు పెళ్లి చేసుకుంటే పెటాకులే.. వేణుస్వామి

వీళ్లు పెళ్లి చేసుకుంటే పెటాకులే.. వేణుస్వామి

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇక మన తెలుగు సినిమా తారలపై స్వాములు, జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తమ కెరీర్ దూసుకెళ్లే మంత్రమో, తంత్రమో చెప్పండని వారిని సినీ తారలు అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లలో వేణుస్వామి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. మరి ఈయన ట్రెండింగ్ లో ఉన్నారా? యూట్యూబ్ వీడియోల్లో వివాదస్పద కామెంట్లతో వైరల్ అయ్యారా అన్నది ప్రజలకే తెలియాలి. ఆయన చెప్పే జాతకాల్లో ఎన్ని నిజం అవుతాయో లేదా ఆయన శిష్యులు ఎంతమంది గొప్పవాళ్లు అయ్యారో మనకు తెలియదు కానీ.. ఆయన ఇంటర్వ్యూల్లో మాత్రం ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి కార్పొరేటర్ దాక.. బిగ్ బీ నుంచి మొదలుపెట్టి రాకెట్ రాఘవ దాక అందరి జాతకాలు చెప్పానంటారు. మొన్నటికి మొన్న కేసీఆర్ గెలవకుంటే తాను జాతకాలు చెప్పడం మానేస్తా అంటూ సవాల్ విసిరారు. చివరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేసీఆర్ అపొజిషన్ లో కూర్చున్నా.. వేణుస్వామి మాత్రం యూట్యూబ్ ల్లో ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.

తాజాగా ఆయన గారు బాగా వైరల్ అయ్యే జాతకం ఒకటి చెప్పారు. మరి దాని రీచ్ ఎంతుంటుందో తెలియదు. మొత్తానికైతే బల్లగుద్ది మరీ చెప్పారు. తాను చెప్పింది వందశాతం జరుగుతుందని. రష్మిక, విజయదేవరకొండ మధ్య ఏదో ఉందని అందరికీ తెలుసు. వేణుస్వామి వీరిద్దరి గురించి చెబుతూ.. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటారని, కానీ కొన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకుంటారని బాంబు పేల్చారు. ఈ విషయాన్ని తాను స్వయంగా రష్మికకే చెప్పానని, ఈ విషయంలో రష్మిక తనతో గొడవ కూడా పెట్టుకుందని చెప్పుకొచ్చారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో వేణుస్వామికే తెలియాలి. విడాకుల దాక ఎందుకు వారు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలిగా అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

మరికొన్ని సినీ విశేషాలు…

బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!

RELATED ARTICLES

Most Popular

Recent Comments