Homebreaking updates newsఇదే జరిగితే పాన్ ఇండియాలో ప్రభాస్ ఒకే ఒక్కడు?

ఇదే జరిగితే పాన్ ఇండియాలో ప్రభాస్ ఒకే ఒక్కడు?

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బహుబలి ఘన విజయాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియన్ లెవల్లోనే నిర్మిస్తున్నారు. దాదాపు అన్నీ భారీ బడ్జెట్ మూవీలే. బహుబలి తర్వాత సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ వంటి భారీ ప్రతిష్ఠాత్మక సినిమాలే వచ్చాయి. కానీ అవి ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టు ఆడలేదు. కానీ డిసెంబర్ లో వచ్చిన ‘సలార్’ తో ప్రభాస్ తన ఫ్యాన్స్ లో ఆకలిని తీర్చాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టు రోల్ పడడమే కాదు ఆ సినిమా 700 కోట్ల దాక వసూలు చేసి ఆయన కెరీర్ కు మరో మైల్ స్టోన్ అందించింది.

ఇప్పుడు దేశమంతా చూస్తున్న హీరో ప్రభాస్. ఆయన రాబోయే సినిమాలు మరింత ప్రతిష్ఠాత్మకమైనవే. అవన్నీ భారీ బడ్జెట్ లే. ప్రస్తుతానికి ఆయన 6 సినిమాల్లో చేస్తున్నారు. ఆ సినిమాల ద్వారా రాబోయే ఒకటి, రెండు సంవత్సరాల్లో కనీసం 6 వేల కోట్ల దాక బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అద్భుతం అని చెప్పాలి. రాబోయే ప్రభాస్ సినిమాలు ఏంటో చూద్దాం..

కల్కి…
ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ఇది. దీని దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మూవీని గ్లోబల్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇందులో కమల్ హాసన్ , అమితాబ్, దీపికా పడుకోనే, దిశా పటానీ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ దాదాపు 2 వేల కోట్లు. పైగా ఇది రెండు పార్టులుగా రాబోతోంది. అంటే సుమారు 3వేల కోట్లకు తక్కువ రాదని అంచనా.

మారుతి మూవీ…
కల్కితో పాటే మారుతి డైరెక్షన్ లో ఓ చిన్ని సినిమా చేస్తున్నాడు. ఇది కమర్షియల్ ఎంటర్ టైనర్. కామెడీ, ఫైట్స్, లవ్ , రొమాన్స్ తో మారుతి మార్క్ స్టోరీ. ఫ్యాన్స్ కు విందుభోజనం లాంటి సినిమా ఇది. ఈ మూవీ కూడా ఎంత లేదన్నా 500 కోట్ల దాక వసూలు చేయవచ్చు.

స్పిరిట్…
ఇక ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సలార్ తో ప్రభాస్, ‘యానిమల్’తో సందీప్ రెడ్డి క్రేజ్ ఆకాశాన్నంటింది. ఇక ప్రభాస్ వంటి పక్కా మాస్ హీరోతో సందీప్ సినిమా అంటే ‘యానిమల్’ కే బాబు లా ఉండే అవకాశాలు ఉన్నాయి. యానిమల్ లా ఇది కూడా వర్కవుట్ అయితే ఈజీగా 1500 కోట్ల దాక వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

సలార్ 2…
సలార్ సూపర్ డూపర్ హిట్ కావడంతో అందరి ఆసక్తి ఇక రెండో పార్ట్ పై ఉంది. పార్ట్ వన్ ను మించేలా అసలు కథ దీనిలో ఉండబోతోంది. ప్రభాస్ ను మరింత పవర్ ఫుల్ గా చూపించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు. ఇది కూడా 1000-1500 కోట్లు వసూలు చేయడం పక్కా.

హనురాఘవపూడి మూవీ…
సీతారామం డైరెక్టర్ హనురాఘవపూడి తో ఓ సినిమా కమిట్ అయ్యాడు ప్రభాస్. యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. ప్రభాస్ సైనికుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అంటే సాలిడ్ స్టోరీ కాబట్టి ప్రభాస్ ఇరగదీసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది కూడా వెయ్యి కోట్ల బిజినెస్ చేయడం సులువే.

భక్త కన్నప్ప…
ఇది మంచు విష్ణు మూవీ. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ కీలక రోల్ చేస్తున్నాడు. కాబట్టి ప్రభాస్ పేరుతో బిజినెస్ సాగుతుంది. కాబట్టి ఈ మూవీ కూడా బాగానే కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇలా ఆరు సినిమాలు వేల కోట్ల బిజినెస్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయే అవకాశం ఉంది.

మరికొన్ని సినీ సంగతులు…

మహానటి చిరుతను పెంచుకుందట!

RELATED ARTICLES

Most Popular

Recent Comments