భారత్ సమాచార్, రాజకీయం : వైసీపీ పార్టీలో ఉన్న ఎంపీల, ఎమ్మెల్యేల ఆస్తుల విలువను చెపుతూ ప్రముఖ నటుడు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాటు ట్వీట్టర్ వేదికగా వైసీపీ పార్టీ అభ్యర్థులపైన వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. అయితే దేని ఆధారంగా ఇలా ఆరోపించారు అనే వివరాలు మాత్రం తెలుపలేదు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఆ ట్వీట్ ను జనసైనికులు తెగ వైరల్ చేస్తున్నారు.
నాగబాబు చేసిన ట్వీట్..
అనగనగ ఒక పేదవాడు పదుల సంఖ్యల్లో ప్యాలెస్ లు, వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్సూ, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న పేదవాడు…నవ్వకండి. ఇది సీరియస్ మ్యాటర్…
దేశం లోనే ధనిక ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానం లో ఉన్న మీరు ‘పేదోడికి పెత్తందార్లకి మధ్య యుద్దం’ అంటుంటే నవ్వాగట్లేదు సారూ,
చెప్పే మీకు కామెడీగా లేకపోయీన వినే మాకు వింతగా ఉందండి..
బహుశా అది నిజమేనేమో సుమండి ‘పెత్తందార్లైన మీకు, పేదోడికి మధ్య నిజంగానే యుద్దం అందుకే మీరు రాష్ట్రమంతా ‘సిద్దం’ బ్యానర్లతో సిద్దం అయ్యారనిపిస్తుంది.
అంటూ వ్యంగ్రాస్తాలు సంధించారు. వైసీపీ పార్టీలో ఉన్న మొత్తం ఎంపీల ఆస్తుల విలువను ఆ ట్వీట్ లో రూ.4776 కోట్లు గా చెప్పారు. ఇక వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ఆస్తుల విలువను రూ.3379 కోట్లు గా వెల్లడించారు. దేశంలోనే 3వ అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వైసీపీ వారే అని ఆ ట్వేట్ లో పేర్కొన్నారు. దీనిపై కొందరు వైసీపీ పార్టీ స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఆధారాలతో ఆ ట్వీట్ ను చేశారో తెలపాలంటూ కొందరు వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. జనసేన నాయకుడు నాగబాబు చేస్తున్నవి నిరాధార ఆరోపణలు అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొట్టి పడేశారు.