భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇలియానా.. ఈ పేరు చెబితే చాలు అప్పట్లో యువతకు నిద్ర వచ్చేది కాదు. అంతలా డిస్టర్బ్ చేసేవి ఈ భామ సొగసులు. ఇప్పటికీ ఆమె అందం ఏమాత్రం వన్నె తగ్గలేదు. బెల్లీ సుందరిగా పేరుగాంచిన ఈ అమ్మడు ‘పోకిరి’తో చేసిన అల్లరి యూత్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఆమె నటనా కౌశలం కన్నా ఆమె అందాల విందుకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు తెలుగు, తమిళ అగ్ర స్టార్ హీరోలతో నటించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అవుదామనుకుంది. అక్కడ సినిమాలు చేస్తూ.. ఆ మధ్య కొంచెం గ్యాప్ కూడా తీసుకుంది. గోవాలో సెటిల్ అయినట్టు, ఈ మధ్యే ఓ బిడ్డకు తల్లి అయినట్టు సోషల్ మీడియా ద్వారా వార్తలు బయటకు వచ్చాయి.
తాజాగా ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించనుందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో విశేషం ఏంటంటే.. అందులో రవితేజ సరసన నటించనుందట. వీరిది ఇప్పటికే పెద్ద హిట్ పెయిర్. ఈ బ్యూటీ ఐదో సారి మాస్ మారాజాకు జంటగా కనిపించనుందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ అంటోనీ.. సినిమాలు వచ్చాయి. రవితేజ కథానాయకుడిగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే హ్యట్రిక్ మూవీ కావటం విశేషం. గతంలో వీరి కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ మూవీలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశాయి. అజయ్ దేవ్ గన్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’ కు తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తో బిజీ బిజీగా ఉన్నారు. ఆ సినిమాను పూర్తి చేసిన వెంటనే రవితేజ, ఇలియానా మూవీ పట్టాలెక్కనుంది. అంటే మరోసారి ఇలియానా అందాల ఆస్వాదనకు ఆమె అభిమానులు, సినీ ప్రేమికులు రెడీగా ఉండాల్సిందే మరి.