భారత్ సమాచార్, రాజకీయం ;
వేల కోట్ల నిధులతో ప్రజాసంక్షేమం
హుజుర్‌నగర్ నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం
క్రీడా ప్రాంగణాలతో యువకుల్లో నూతన ఉత్తేజం
నాణ్యమైన విద్యుత్‌తో అన్నదాతల మోములో ఉత్సాహం
పేదల సంక్షేమం కోసం అలుపెరుగని పోరు
ఆపద అండగా ఉంటాడు మన శానంపూడి సైదిరెడ్డి తీరు
నిరంతరం ప్రజాసేవే ఆయన ధ్యేయం
శానంపూడి ఏలుబడిలో ప్రజలు క్షేమం
విలువలతో కూడిన నాయకత్వం
శానంపూడి సైదిరెడ్డితోనే సాధ్యం
నిరుపేదలకు అండగా నిరంతరం ఆర్థిక చేయూత
నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత
హుజుర్‌నగర్ ఎమ్మెల్యే మన శానంపూడి సైదిరెడ్డి
మహనీయుల ఆశయ సాధకుడు
సంక్షేమ పథకాలను పేదలకు సమాకూర్చిన కృషీవలుడు
అభివృద్ధిని ఆచరణలో చూపించి అందరి మెప్పు పొందిన ప్రజాసేవకుడు
ప్రజాదరణ కలిగిన నాయకుడు మన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజుర్‌నగర్ నియోజకవర్గం ప్రస్తుతం గులాబీ పూదోట మారింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నల్లమాద ఉత్తకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సాధించి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ తర్వాత ఉత్తమ్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దీంతో హుజుర్‌నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజుర్‌నగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడింది. కారు వేగానికి హస్తం పార్టీ కంగుతిన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి హుజుర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల రూపురేఖలు మారాయని, బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని హుజుర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టంచేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా పల్లెప్రగతి పథకంలో భాగంగా ప్రతీగ్రామంలో నర్సరీల ఏర్పాటు, ట్రాక్టర్ ట్రాలీల కొనుగోలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు, పల్లెలు పచ్చదనంతో కనువిందు చేసేందుకు పల్లెపకృతి వనాలు, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రైతులను సమన్వయం చేసేందుకు రైతువేదికలు, ప్రతి గ్రామంలో ప్రతీ ఇల్లు పరిశ్రభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ పనులు, పల్లె ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి వ్యాధుల ప్రబలకుండా ఉండేందుకు మురికి కాల్వలను శుభ్రం చేయడం, రోడ్ల గుంతలను పూడ్చివేయడం, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రంచేయడం వంటి పనులు చేపట్టి గ్రామీణాభివృద్ధి కోసం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అహర్నిశలు శ్రమించి పల్లెలను, పట్టణాలను అందంగా తీర్చిదిద్దారు.
ప్రతి గ్రామం పచ్చదనంతో వెలుగొందాలని పల్లెప్రకృతి వనం, గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో పరిఢవిల్లాలని, వృక్ష సంపదను పెంచాలన్న ఉద్దేశ్యంతో హరితహారం పథకంలో భాగంగా నియోజకవర్గంలో లక్షలాది మొక్కలను నాటడం, భూములు లేని నిరుపేదలు స్మశానవాటిక లేక ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశ్యంతో వైకుంఠధామాల నిర్మాణం, దేవాలయాలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, ఉన్న దేవాలయాలకు పునర్నిర్మాణ పనులు చేపట్టడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మనఊరు-మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి, పట్టణాల్లో, గ్రామాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి సీసీ రోడ్ల నిర్మాణ పనులు, మిషన్ భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు అందేలా శానంపూడి సైదిరెడ్డి కృషి చేశారు.
గూడు నీడ లేని నిరుపేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పేద దళితులకు ఉపాధి కల్పించి భరోసా కల్పించాలని దళితబంధు ఆర్థిక సాయం, రైతు పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు, మరణించిన రైతు కుటుంబం రోడ్డుమీదికి రావొద్దని రైతుబీమా పథకం, అనారోగ్యానికి గురైన నిరుపేద కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు సీఎం సహాయనిధి చెక్కుల అందజేసి ఎన్నో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదుకున్నాడు. ఇలా మరెన్నో పథకాలను హుజుర్‌నగర్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదకుటుంబానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేశారు. అందుకే ఆదర్శ నాయకుడిగా, నిరంతరం ప్రజాసేవకుడిగా సైదిరెడ్డి పేరుతెచ్చుకున్నాడు.
అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా యువకులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, ఎన్నో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి మరెన్నో కుటుంబాలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదుకుని అండగా నిలిచాడు. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసిన శానంపూడి సైదిరెడ్డి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అభివృద్ధిని ఆచరణలో చూపించి ఆదర్శంగా నిలిచాడు. ఆదరణ కలిగిన నేతగా ఎదిగాడు. అదేవిధంగా హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేశాడు. అంతేకాకుండా అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి బెస్ట్ ఫ్యాకల్టీతో బోధన సౌకర్యం కల్పించాడు. ఇలా లెక్కకు మిక్కలి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల మన్నలను పొందాడు. హజుర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్న శానంపూడి సైదిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని, నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటారని, హుజుర్‌నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.