Homemain slidesపారిస్ ఒలింపిక్స్ కు భారత క్రీడా సైన్యం

పారిస్ ఒలింపిక్స్ కు భారత క్రీడా సైన్యం

భారత్ సమాచార్, దిల్లీ ;

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ తాజాగా ప్రకటించింది. 117 మంది అథ్లెట్లు, 140 మంది సహాయ సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దేశీయ అథ్లెట్లలో షాట్‌ పుటర్‌ అభా ఖతువా మినహా మిగిలిన వారందరూ పారి‌స్ కు వెళ్తున్నారు. అభా గైర్హాజరుకు గల కారణాలను ఎవరూ వెల్లడించలేదు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఆరంభ వేడుకలను ఈ నెల26 వ తేదీన నిర్వహించనున్నారు. 140 మంది సహాయ సిబ్బందికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం సంగం మందిని అంటే 72 మందికి మాత్రమే ప్రభుత్వం తరపున ఖర్చును భరించనుంది. మిగిలిన వారు తమ సొంత ఖర్చులతో పారిస్‌ ప్రయాణానికి సిద్ధం అయ్యారు.

అత్యధికంగా అథ్లెటిక్స్‌ నుంచి 29 మంది (18 పురుష, 11 మహిళ అథ్లెట్లు),
షూటింగ్‌ 21 (11 మహిళ, 10 పురుషులు),
హాకీ 19,
టేబుల్‌ టెన్నిస్‌ 8,
బ్యాడ్మింటన్‌ 7,
రెజ్లింగ్‌ 6,
ఆర్చరీ 6,
బాక్సింగ్‌ 6,
గోల్ఫ్‌ 4,
టెన్నిస్‌ 3,
స్విమ్మింగ్‌ 2,
సెయిలింగ్‌ 2,
ఈక్వెస్ర్టియన్‌, జూడో, రోయింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ నుంచి ఒక్కరు చొప్పున భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ బృందం (119)తో పోలిస్తే ఈ సారి ఇద్దరు తగ్గారు. మాజీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ ఈ బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా వ్యవహరిస్తాడు. తెలుగు రాష్ట్రాల నుంచి షట్లర్లు సింధు, సాత్విక్‌, బాక్సర్‌ నిఖత్‌, షూటర్‌ ఇషా సింగ్‌, టీటీ ప్లేయర్‌ శ్రీజ, అథ్లెట్లు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ, ఆర్చర్‌ ధీరజ్‌ పారిస్‌ క్రీడల బరిలో ఉన్నారు.

మరికొన్ని వార్తా కథనాలు…

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments