భారత్ సమాచార్, అమరావతి: మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవడానికి ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో నిహారిక తన పొలిటికల్ ఎంట్రీతో పాటు, బాబాయ్ జనసేన పార్టీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించగా, అలాంటిది ఏమీ లేదని.. కావాలంటే పార్టీ తరుఫున పని చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందని నిహారిక ప్రకటించింది.
ఏపీలో ఇల్లు కొనాలని చూస్తున్నాం..ఓటుహక్కు రద్దుచేశారు:
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని తెలిపింది. ఏపీలో ఇల్లు కొనాలని చూస్తున్నాం. నాన్న నాగబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చింది. ఒకవేళ నాన్న ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎక్కడో ఒక చోట ఇల్లు తీసుకుంటామని తెలిపింది. నాన్న రాజకీయాల్లో బాగా బిజీగా మారారని, కనీసం 5 నిమిషాలు కూడా తమతో మాట్లాడే పరిస్థితి లేదని నిహారిక పేర్కొంది. పవన్ బాబాయ్ బాగా కష్టపడుతున్నాడని పేర్కొన్నారు. ఆంధ్రలో ఉన్న తన ఓటును తొలగించారని.. నా ఓటును ఎందుకు రద్దు చేశారో తెలియదంటూ వాపోయింది.