Homebreaking updates newsసీఎంగా ‘జార్ఖండ్ టైగర్’ చంపా సోరెన్

సీఎంగా ‘జార్ఖండ్ టైగర్’ చంపా సోరెన్

భారత్ సమాచార్, జాతీయం : భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్  బుధవారం తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. గవర్నర్ కి తన రాజీనామ పత్రాన్ని పంపారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపా సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుని 7గంటలకు పైగా ప్రశ్నించి, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది.

హేమంత్ అరెస్ట్ ఖాయమని తెలిసే ముందుగానే హేమంత్ భార్యను కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రిగా చేస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బాగానే వినిపించింది. అయితే దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో.. చివరకు పార్టీ సీనియర్ నేత చంపా సోరెన్ ను సీఎంగా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కల్పనా సోరెన్ సీఎంగా చేయడానికి తోటి కోడలు సీతా సోరెన్ ఒప్పుకోనట్టు సమాచారం. దీంతో ఇంటి పోరు కారణంగా కల్పనా సీఎం పదవికి దూరం కావాల్సి వచ్చింది.

అయితే చంపా సోరెన్ కూడా రాష్ట్రంలో చాలా బలమైన నాయకుడే. ఆయనను జార్ఖండ్ ప్రజలు ముద్దుగా, ప్రేమగా ‘జార్ఖండ్ టైగర్’ గా పిలుచుకుంటారు. ఈయన హేమంత్ సోరెన్ కు అత్యంత దగ్గరి బంధువు కూడా. అత్యంత సన్నిహితుడు. అలాగే ఆయనకు సోరెన్ మంత్రి వర్గంలో రవాణా మంత్రిగా పని చేసిన అనుభవం చాలానే ఉంది. ఈయన సెరైకెలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిహార్ నుంచి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపా పేరు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. శిబు సోరెన్ తో పాటు చంపాపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచే ఆయనను రాష్ట్ర ప్రజలు, మీడియా  ‘జార్ఖండ్ టైగర్’ అనే పిలుస్తున్నారు.

మరికొన్ని రాజకీయ కథనాలు…

నరేంద్ర మోడీ‌@420 హామీలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments