Homebreaking updates newsపెళ్లైన వాడితో జర్నీ..రతిక రోజ్ ట్వీట్ వైరల్

పెళ్లైన వాడితో జర్నీ..రతిక రోజ్ ట్వీట్ వైరల్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అత్యంత నెగిటివిటీని మూటగట్టుకున్న కంటెస్టెంట్స్ లో టాప్ లో నిలిచింది రతికా రోజ్. ఈమె ప్రవర్తన విసుగు పుట్టించడంతో మొదట్లోనే ఎలిమినేట్ అయ్యింది. మళ్లీ సెకండ్ చాన్స్ వచ్చింది. అయితే ఈసారి అదే తీరు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో రతిక రోజ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. మొదట్లో అతడితో సన్నిహితంగా ఉంది. పల్లవి ప్రశాంత్ నువ్వంటే నాకు ఇష్టం అంటూ అతన్ని గెలికింది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందేమో అనుకున్నారంతా. అనూహ్యంగా రెండో వారం అందరితో కలిసి పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసింది. హౌస్ లోకి వచ్చి నువ్వు ఏం పీకావ్.. అంటూ మండిపడింది.

రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ వ్యవహారం తెరపైకి తెచ్చింది. తన పీఆర్ లు రాహుల్ తో రతిక రోజ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపెట్టారు. దీనిపై రాహుల్ ఫైర్ అయ్యాడు. ఒకరిని వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తోందంటూ పరోక్షంగా చురకలు అంటించాడు.

ఇక రతికతో పల్లవి ప్రశాంత్ ఆమెతో డిస్టెన్స్ మెయింటెన్ చేశారు. ఆ తర్వాత రతిక..యావర్ ను లైన్ లో పెట్టింది. ఆమెలోని డిఫరెంట్ షేడ్స్ చూసిన ఆడియన్స్ నాలుగో వారమే ఇంటికి పంపేశారు. అనూహ్యంగా ఆమెకు సెకండ్ చాన్స్ వచ్చింది. ఆమెకు సెకండ్ చాన్స్ వచ్చింది. ఆమె సెకండ్స్ ఇన్నింగ్స్ కూడా గొప్పగా సాగలేదు.

12వ వారం రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చాక రతిక రోజ్ పెద్దగా కనిపించలేదు. కొన్నాళ్లు మాత్రం గోవాలో ఎంజాయ్ చేసి వచ్చింది. సడన్ గా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ తో కనిపించింది. అతడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొన్ని సార్లు కొందరు ఫ్రెండ్స్ చాలా విలువైన వారు. మా జర్నీ మొదలైంది. ఇది మరిన్ని తీరాలు చేరాలి అంటూ రాసుకొచ్చింది. పెళ్లైన అమర్ దీప్ గురించి రతిక రోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మడు బుద్ధి అంత మంచిది కాదు.. అమర్ జాగ్రత్తగా ఉండూ అంటూ కొందరు హితువు పలికారు.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

కొణిదెల వారి పెద్దబ్బాయి.. అల్లువారి చిన్నమ్మాయి

RELATED ARTICLES

Most Popular

Recent Comments