భారత్ సమాచార్, సినీ టాక్స్;
సీనియర్ హీరో అయినా, కామెడీ కథానాయకుడు అయిన, కుర్ర నటుడు అయినా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ ఒకటే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు… అదే పాన్ ఇండియా మూవీ. ఇందులో చాలా మటుకు సక్సస్ కూడా అవుతున్నారు. కొందరు బొక్క బోర్ల కూడా పడ్డారు.
ప్రస్తుతం ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వటానికి రెడీ అయిపోయాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తెలుగులో వరుస పెట్టి సినిమాలు తీసి గుర్తింపు పొందాడు కిరణ్. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ‘క’ మూవీ టీజర్ ను విడుదల చేశారు.దీన్ని పాన్ ఇండియా మూవీ గా నిర్మించినట్లు అన్ని భాషల్లో టైటిల్ ని వేశారు. టీజర్ ను బట్టి చూస్తే ఇది ఒక పీరియాడికల్ డ్రామ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పచ్చు. నిజానికి కిరణ్ నుంచి ఇది ఒక గుడ్ మూవ్. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అంటే హెవీ గ్రాఫిక్స్ ఉన్న సోషియో ఫాంటసీ మూవీ అయి ఉండాలి. అప్పుడే మూవీకి హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి చాలా బడ్జెట్ అవసరం. కిరణ్ సినిమాలకి ఇప్పుడు అంత బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదు. దీంతో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ వైపుకి వెళ్లాడు కిరణ్. ఊపిరి సలపని ఉత్కంఠ ను రేపే సినిమాలకి పెద్ద బడ్జెట్ అవసరం ఉండదు. మంచి కథ ఉంటే చాలు.
ప్రస్తుతం విడుదల చేసిన టీజర్ మటుకు చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేలాగా టీజర్ ను కట్ చేశారు. టీజర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో కిరణ్ మాసీగా ఉంది. టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. చూడాలి పాన్ ఇండియా లెవల్లో మూవీని ఎలా ప్రమోట్ చేస్తారో.. ఎంత హైప్ క్రియేట్ అవుతుందో, ఎలాంటి ఫలితం రాబడుతుందో.