Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణం.. శుభాకాంక్షలు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో తమిళ భాషలో ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో తోటి పార్లమెంట్ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఆయన చేత ప్రమాణం చేయించారు.

 

ప్రమాణస్వీకారం అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ఎంపీగా ప్రమాణం చేయడం గర్వంగా ఉందని.. చాలా గొప్పగా అనిపిస్తుందని కమల్ హాసన్ పేర్కొన్నారు. కాగా 2018లో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ఇండియా కూటమికి కమల్ హాసన పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చింది డీఎంకే.

 

డీఎంకే సభ్యుల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీగా కమల్ హాసన్‌ సహా మరో ఐదుగురిని డీఎంకే నామినేట్ చేయగా.. వారంతా రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇవాళ కమల్ హాసన్‌తో పాటు తమిళనాడు నుంచి ఎన్నికైన మరో ఐదుగురు డీఎంకే అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన కమల్ హాసన్‌ అటూ సినిమాలు చేస్తూనే ఇటూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన ఆయనకు అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Share This Post