Homemain slidesపెరుగుతున్న బాలికల కిడ్నాపులు..పేరెంట్స్ అలర్ట్

పెరుగుతున్న బాలికల కిడ్నాపులు..పేరెంట్స్ అలర్ట్

భారత్ సమాచార్, జాతీయం : తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ పిల్లల కిడ్నాప్ లు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక అదే చెబుతోంది. గత పదేళ్లుగా పిల్లల కిడ్నాపులు ఎక్కువ అవుతున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.

నివేదికలోని వివరాలు..

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 83,500 మంది పిల్లలు కనపడడం లేదు. అంటే వీరు కిడ్నాప్ కావడమో, తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోవడమో జరిగి ఉంటుంది. వీరిలో ఇప్పటికీ 47,500 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ కనపడని పిల్లల్లో 78శాతం 18ఏండ్లలోపు బాలికలే కావడం గమనించదగిన విషయం. దేశంలోనే అత్యధికంగా పిల్లల కనిపించకుండా పోయిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. ఆతర్వాత రెండో స్థానంలో మధ్యప్రదేశ్, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఎనిమిదో స్థానంలో తెలంగాణ ఉంది. ఇక తెలంగాణలో 2022 సంవత్సరంలో 3433 మంది పిల్లలు అదృశ్యమైనట్లు నివేదిక చెబుతోంది. ఇందులో 654 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. వీరిలో 350మంది అమ్మాయిలే ఉన్నారు.

బాధితుల్లో బాలికలే ఎక్కువ..

ఈ నివేదిక ప్రకారం బాలికలే ఎక్కువగా అదృశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. 18ఏండ్ల లోపు బాలికలను కిడ్నాప్ చేయడం గానీ, మాయ మాటలు చెప్పి దుండగులు తమతో తీసుకెళ్తున్నారు. వీరిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. అలాగే అవయవాల దోపిడీ కూడా చేస్తున్నారు. ఇక మగ పిల్లలను కూలీ పనుల్లో, భిక్షగాళ్లుగా మార్చడం, అసాంఘిక కార్యకలాపాల్లో వినియోగించుకోవడం చేస్తున్నారు.

తల్లిదండ్రుల భయపడడం కంటే జాగ్రత్తగా ఉండడం మేలు. పిల్లలను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండడం ముఖ్యం. అపరిచితులతో మాట్లాడవద్దని, వారు ఇచ్చిన ఆహార పదార్థాలు, డబ్బులు తీసుకోవద్దని ముందస్తు జాగ్రత్తగా చెప్పాలి. ఏదైనా అనుమానం వస్తే అరవడమో, లేకుంటే ఫోన్ చేసే అవకాశం ఉంటే చేయడమో చేయాలని సూచించాలి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments