భారత్ సమాచార్, హైదరాబాద్ :
అక్షరాల ఆయుధాలతో జర్నలిజం విలువలకు, నియమ నిబంధనలకు కట్టుబడి, ప్రజా సమస్యలే లక్ష్యంగా శాస్త్రీయ దృక్పథంతో అన్ని వర్గాల గొంతుకను వినిపించేందుకు భారత్ సమాచార్.నెట్ న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం.
అక్షర నిజాలు, పదాల విశ్లేషణలు, వాస్తవాల వార్తల కోసం‘భారత్ సమాచార్.నెట్’ను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం 2024 మే 3వ తేదీన పూర్తిస్థాయిలో భారత్ సమాచార్.నెట్ సేవలను ప్రారంభిస్తున్నాం.
భారతీయ జర్నలిజంలో నిష్ణాతురాలు, ప్రజాగొంతుక, వర్తమాన రాజకీయాలతోపాటు, ప్రపంచంలోని ఏ అంశాన్నైనా అనర్గళంగా వాస్తవిక దృక్పథంతో విశ్లేషించే స్వతంత్ర జర్నలిస్ట్, ఐదుసార్లు లాడ్లీ మీడియా అవార్డ్ అండ్ యూనిసెఫ్ అవార్డ్ గ్రహిత తులసి చందు చేతుల మీదుగా ‘‘భారత్ సమాచార్.నెట్’’ సేవలను ప్రారంభించినందుకు సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.