భారత్ సమాచార్, సినీ టాక్స్ ; తాత ఏమో ప్రతి భారతీయ భాషలో సినిమాలు నిర్మించిన మూవీ మొఘల్ రామానాయుడు. తండ్రి ఏమో తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసిన సినిమాలు రూపొందించిన నిర్మాత. మరి బాబాయ్ అయితే మాస్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలి ఆడియన్స్ ని కూడా మెప్పించిన విక్టరి వెంకటేష్. మరి ఇలాంటి కుటుంబం నుంచి వచ్చే వారసుడిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉంటాయి. అందులోనూ మొదటి సినిమా అంటే భారీ బడ్జెట్ మాస్ సినిమాను ఎక్సెప్ట్ చేస్తారు.
కానీ రానా రోటీన్ కు భిన్నంగా ఆలోచించాడు. తన మొదటి సినిమాగా ‘లీడర్’లాంటి పొలిటికల్ డ్రామా స్టోరీని ఎంచుకున్నాడు. తన తొలి సబ్టెక్ట్ ను ఎంచుకోవటంలోనే రానా సక్సస్ అయ్యాడు. తెలుగు సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ‘లీడర్’. టిపికల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. నటుడిగా రానాకి మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది ఈ మూవీ. శేఖర్ కమ్ముల మార్క్ దర్శకత్వం, పొలిటికల్ డ్రామా, భారతీయ రాజకీయాలపై సెటేరికల్ డైలాగ్స్, మిక్కి జే మేయర్ సంగీతం, రానా నటన ఈ మూవీకి హైలెట్స్ గా నిలిచాయి. 2010 వ సంవత్సరం ఫిబ్రవరి 19 న విడుదలైన ఈ మూవీ తెలుగు క్లాసిక్స్ మూవీలో ఒకటిగా చేరింది.
తాజాగా ఈ మూవీ రీరిలీజ్ తేదీని ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘లీడర్ ’మూవీని రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నారు. రీరిలీజ్ ట్రైలర్ ని కూడా ఈ వారంలో విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, దీనికి ఒక వారం ముందు ‘లీడర్’ మూవీని సినీ ప్రేమికుల ముందుకు తేవటం మరో విశేషం. ‘లీడర్’ మూవీ రీరిలీజ్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.