భారత్ సమాచార్, ఆరోగ్యం ;
- ఒత్తిడి
అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అశ్వగంధ అంటే సంస్కృతంలో గుర్రపు వాసన అని అర్థం వస్తుంది. అందువల్లే దానికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని ఇండియన్ జిన్సెంగ్ అని, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు - వాపులు, ట్యూమర్లు
అశ్వగంధలో అధిక మోతాదుతో వితనోలైడ్స్ ఉంటాయి. అందువల్ల అశ్వగంధ వాపులను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తుంది. - ఆందోళన
అశ్వగంధను నిత్యం తీసుకున్నట్లయితే ఒత్తిడితోపాటు ఆందోళన కూడా తగ్గుతుందని సైంటిస్టులు తెలిపారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తీవ్రమైన స్ట్రెస్, ఆందోళనలతో బాధపడుతున్న 64 మందికి నిత్యం అశ్వగంధ ఇచ్చారు. 60 రోజుల తరువాత వారిలో ఒత్తిడి, ఆందోళన తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు అశ్వగంధను నిత్యం తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది - సంతాన లోపం
సంతాన లోపం సమస్యతో బాధపడే వారికి అశ్వగంధ ఒక వరమని చెప్పవచ్చు. ఇది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. దీంతోపాటు జననావయవాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ క్రమంలో పురుషుల్లో ఉండే సంతాన లోపం సమస్యలు తగ్గుతాయి. 75 మంది పురుషులకు నిత్యం అశ్వగంధను నిర్దిష్టమైన మోతాదులో ఇచ్చి కొన్ని రోజుల తర్వాత వారిని పరీక్షించగా వారిలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయిందని వెల్లడైంది. అలాగే అందులో శుక్రకణాల సంఖ్య పెరిగిందని, వాటి కదలికలు కూడా బాగున్నాయని గుర్తించారు. అందువల్ల సంతాన లోపం సమస్య ఉన్న పురుషులు అశ్వగంధను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. - రోగ నిరోధక శక్తి
అశ్వగంధను నిత్యం తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. అశ్వగంధను నిత్యం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. - క్యాన్సర్
అశ్వగంధలో విథఫెరిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా చూస్తుంది. బ్రెస్ట్, లంగ్, కోలన్, బ్రెయిన్, ఓవేరియన్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.