Homemain slides‘లవ్ మీ’మూవీ ట్రైలర్ రిలీజ్

‘లవ్ మీ’మూవీ ట్రైలర్ రిలీజ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

‘రౌడీ బాయ్స్’ మూవీ ఫేమ్ ఆశిష్ కథానాయకుడిగా, ‘బేబీ’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన తెలుగు బ్యూటీ వైష్టవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ మీ’.ఇఫ్ యూ డేర్ అనేది ఉపశీర్షిక. ఈ మూవీ ట్రైలర్ ను దర్శకనిర్మాతలు నెట్టింట విడుదల చేశారు. దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చిన కథనాయకుడు కాబట్టి భారీ బడ్జెట్ తో, ఉన్నత స్థాయి సాంకేతిక టీంతో సినిమాని తెరకెక్కించారు.

యూత్ ని మెప్పించాలని చేసిన ‘రౌడీ బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి షిప్ట్ అయ్యాడు ఆశిష్. మరి ఈ జోనర్ లో నైనా సినీ ప్రేమికులని మెప్పిస్తాడో లేదో మూవీ రిలీజ్ వరకు వేచి చూడాలి. ప్రచారచిత్రం ఆసాంతం చాలా ఆసక్తికరంగా సాగింది. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కింది. పేరున్న అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. ‘‘ రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు ఒక అలారమ్ మోగుతుంది, నాకేంటో ఎవరైనా, ఏదైనా పని చేయోద్దు అంటే.. అదే పని చేయాలనిపిస్తూ ఉంటది…’’ వంటి డైలాగులు ట్రైలర్ ని ఆసక్తికరంగా మార్చాయి. దిల్ రాజు మూవీ ప్రొడక్షన్స్ లో అరుణ్ భీమవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చాడు. ప్రచార చిత్రంలోని బీజీఎమ్ థ్రిల్లింగ్ గా ఉంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

‘మాయవన్’టీజర్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments