Homebreaking updates newsMahesh Babu: మహేశ్ బాబు కొత్త లుక్.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న న్యూ లుక్  

Mahesh Babu: మహేశ్ బాబు కొత్త లుక్.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న న్యూ లుక్  

భారత్ సమాాచార్.నెట్: సూపార్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోలలో ఆయన ఒకరు. ఆయన గ్లామర్‌కి ఎవరైన ఫిధా కావల్సిందే. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)తో కలిసి మహేశ్ బాబు తన 29వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది.
అయితే రాజ‌మౌళి సినిమాలో హీరో లుక్ గ‌త సినిమాల క‌న్నా భిన్నంగా ఉంటుంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు మ‌హేష్ బాబు లుక్ ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ గ‌త కొన్ని రోజులుగా న‌డుస్తుంది. ఈ క్రమంలో మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. ఇందులో మహేశ్ బాబు పొడవాటి ఉంగరాల జుట్టుతో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. మహేశ్ బాబు ఒక రెస్టారెంట్ లాన్‌లో భార్య నమ్రత, తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉండడం ఈ ఫొటోల్లో కనిపించింది.
మహేశ్ న్యూ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘షేర్’, ‘హాలీవుడ్ హీరో’ అంటూ తమ హ్యాండిల్స్‌లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. జక్కన్న క్రియేటివ్ యూనివర్స్‌లో రూపొందుతున్న ఈ మెగా-స్పెక్టేకల్ హాలీవుడ్ సినిమా రేంజ్ దృశ్యాలను తలపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి జక్కన్న కూడా ఆలస్యం చేయకుండా వెంటవెంటనే షూటింగ్‌ను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు సమాచారం.
RELATED ARTICLES

Most Popular

Recent Comments