Homebreaking updates newsమహేశ్ -రాజమౌళి మూవీ షూటింగ్ అప్పుడే...

మహేశ్ -రాజమౌళి మూవీ షూటింగ్ అప్పుడే…

భారత్ సమాచార్ ,సినీ టాక్స్ : మహేశ్ బాబు- రాజమౌళి మూవీపై ఫ్యాన్స్ ఎన్నో కలలు కంటున్నారు. ఈ సినిమాతో తమ హీరో పాన్ వరల్డ్ స్టార్ కావడం ఖాయమంటూ ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు జర్మనీ వెళ్లడంతో మహేశ్-29 మూవీపై ఇంట్రెస్టింగ్స్ అప్ డేట్స్ అందాయి.

మహేశ్ ఈ మూవీ కోసమే రీసెంట్ గా జర్మనీ వెళ్లినట్టు సమాచారం. అక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయని అంటున్నారు. ఆఫ్రికా అడవుల్లో ఈ యాక్షన్ అడ్వెంచర్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ మూవీని రూ.1000కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారన్న మాటే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ‘దుర్గా ఆర్ట్స్ ’ బ్యానర్ లో ఈ సినిమా వస్తోందట. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఈ మూవీ ప్రారంభం కానుందనే టాక్ వినపడుతోంది. ఈ తర్వాత రెండేండ్లకు అంటే 2026 ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీతో మహేశ్ బాబు ఇండియాలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నారని సినీ పండితులు చెబుతున్నారు. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన దీపికా పడుకునే, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ నటించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలను రాజమౌళి అధికారికంగా వెల్లడించబోతున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ విజువల్స్ ను బయటకు రాకుండా రాజమౌళి కండీషన్లు పెడుతున్నాడు. అలాగే మహేశ్ లుక్ ను కూడా అత్యంత రహస్యంగా ఉంచనున్నారని తెలుస్తోంది. రెండేండ్ల పాటు మహేశ్ ఏ ఇతర ప్రాజెక్టులు, యాడ్స్ లోనూ పాల్గొనవద్దని ఇప్పటికే రాజమౌళి సూచించినట్లు వార్తలు వచ్చాయి.

మరికొన్ని సినీ సంగతులు…

జగదేక వీరుడు… అతిలోక సుందరి

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments