Homemain slidesసెన్సార్ ప్రశంసలు అందుకున్న మంచు లక్ష్మి ' ఆదిపర్వం '

సెన్సార్ ప్రశంసలు అందుకున్న మంచు లక్ష్మి ‘ ఆదిపర్వం ‘

భారత్ సమాచార్, సినీ టాక్స్: గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీ ఏ సినిమా తీసినా అంతాగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా.. తీవ్రంగా ట్రోల్స్‌కి గురయ్యారు. దీంతో ఇంకా మంచు ఫ్యామిలీ సినిమాలు టాలీవుట్‌లో కరికి వారు కనుమరుగు అవుతారనే టాక్ కూడా నడిచింది.  అయితే ఇప్పుడు అందరూ వరుస బెట్టి సినిమాలు చేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మంచు విష్టు, మోహన్ బాబు ‘కన్నప్ప’లో నటించి, నిర్మిస్తూ పాన్ ఇండియాల రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా అయ్యిపోయంది. ఇంకా దాదాపు ఎనిమిదేళ్ల సుధీర్ఘ విరామం తరువాత మంచు మనోజ్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంకా మంచు లక్ష్మి చాలా గ్యాప్ తరువారుత ‘ఆదిపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
“ఆదిపర్వం” ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ, ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ!! తెలుగులో ఇలాంటి ఎక్కువగా రాలేదు. వచ్చిన ఒకటి రెండు సినామాలు అంతాగా ప్రేక్షకులు ఆకట్టుకోలేదు. అయితే ఆదిపర్వం చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారంటా. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటన అద్భుతంగా ఉందంటా. ఇంకా విజువల్ ఎఫెక్ట్ సినిమాకు హైలెట్గా నిలుస్తాయని బోర్డు సభ్యులు తెలిపారు.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ – ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు – కన్నడ – హిందీ – తమిళ – మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు “అన్విక ఆడియో” ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందల మందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం!!
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ…“బహు భాషల్లో రూపొందిన “ఆదిపర్వం” అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం” అన్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments