Date and Time

Email : bharathsamachar123@gmail.com

Mann Ki Baat: స్థానిక ఉత్పత్తుల్ని వినియోగించండి.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసంగించే సంగతి తెలిసిందే. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుంటారు. తాజాగా జరిగిన 124వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ఎపిసోడ్‌లో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రత్యేకంగా వ్యోమగామి శుభాన్షు శుక్లా గురించి మాట్లాడారు.

 

అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా భూమికి చేరుకోగానే దేశమంతా గర్వపడిందన్నారు. దేశంలో అంతరిక్ష రంగం దూసుకెళ్తోందని మోదీ తెలిపారు. త్వరలో నేషనల్ స్పేస్ డే రాబోతోందనీ.. దాని ఐడియాలను నమో యాప్‌లో చెప్పాలని కోరారు. అలాగే ఇన్‌స్పైర్ మనక్ అభియాన్ గురించి కూడా ప్రస్తావించారు మోదీ. విద్యార్థులు అంతరిక్ష పరిజ్ఞనంపై ఆసక్తి చూపుతున్నారని.. ఇన్‌స్పైర్ మనక్ విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమం అని చెప్పారు.

 

ప్రతీ స్కూల్ నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఇక ముంబై వేదికగా త్వరలో ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరగబోతోందని మోదీ తెలిపారు. ఇందులో భారత్ ఒలింపిక్స్, ఒలింపియాడ్‌లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక ఎంతో మంది త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న ప్రధాని.. ఆగస్టు 15న మళ్లీ మనం స్వాతంత్య్రం దినోత్సవం జరుపుకుంటున్నామనీ.. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందామని కోరారు. ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా.. ప్రజలు స్థానిక ఉత్పత్తుల్ని వినియోగించాలని సూచించారు.

Share This Post