భారత్ సమాచార్, నెల్లూరు జిల్లా ; ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి వరుడు కోటేశ్వర్ రావు, వధువు శిరీషల వివాహ వేడుకలు బంధు, మిత్రుల సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ, శాస్త్రీయ పద్దతుల్లో రామస్వామి పల్లి గ్రామంలోని శ్రీ సీతా రాముల కళ్యాణ మండపంలో శుక్రవారం వేకువజామున జరిగిన ఈ కళ్యాణ వేడుకల్లో రైల్వే అధికారులు మనోహర్, తదితర మిత్ర, రైల్వే అధికారులు పాల్గొని నూతన జంటను ఆశ్వీర్వదించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రులు వెంకటేశ్వర్లురెడ్డి (పెద్దారెడ్డి) , అశోక్ కుమార్, ఎస్ ఎస్ రాజా పాల్గొని నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలకు హాజరై తమను ఆశ్వీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన బంధువులకు, మిత్రులకు, రైల్వే అధికారులకు, సహుద్యోగులకు పేరు పేరునా రేల్వే ట్రాక్ టెక్నిషియన్ వరుడు కోటేశ్వరావు ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని అనివార్య కారణాల వలన శుభకార్యానికి రాలేక పోయిన రైల్వే అధికారి శ్రీనివాస్ రెడ్డి నూతన వధూవరులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.