Homemain slidesమ్యాక్స్ టన్ హాల్ సిరీస్..చూస్తే మతి పోవాల్సిందే

మ్యాక్స్ టన్ హాల్ సిరీస్..చూస్తే మతి పోవాల్సిందే

భారత్ సమాచార్, సినీ టాక్స్: ప్రస్తుతం భాష భేదం లేకుండా ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇండియాలో కూడా వీటిని ఇష్టపడే వాళ్లు కూడా బాగా పెరిగిపోయారు. అయితే ఇప్పటి వరకు మీరు అయితే మీరు ఇప్పటి వరకు యాక్షన్, డ్రామా, కామెడీ, హర్రర్ వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, హాలీవుడ్ లో రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ని చూశారా? అది కూడూ ఓ రేంజ్‌లో రొమాన్స్ ఉండే డ్రామా ఇది. కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే ఒక ఎమోషనల్, లవ్, రొమాంటిక్, యాక్షన్, డ్రామా ఇది. ఇప్పుడు మన దేశంలో ట్రెండింగ్ లో ఉంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎందుకు అంత ట్రెండ్ అవుతుందో తెలుసుకుందాం.

ఈ వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మరి. రొమాంటిక్ వెబ్ సిరీస్‌లకు అమ్మ మొగుడులా ఉంటుంది. అయితే ఇంత హైప్ ఇస్తున్న వెబ్ సిరీస్ పేరు ‘మ్యాక్స్ టన్ హాల్’ ఇప్పుడు ఇది ఇండియాలో టాప్ 5లో ఒకటిగా ట్రెంట్ అవుతుంది. విడుదలకు ముందే ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఆసక్తి పెంచారు. అయితే ఇంత హైప్ రావడానికి కారణం డబ్బుకి, పేదరికానికి మధ్య వ్యత్యాసం ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటివి మేము తెలుగులో చాలా సినిమాలు, సిరీస్‌లు చూశాం అని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీరు చూసిన వాటి అన్నింటి కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బున్న కాలేజీ కుర్రాల మధ్య గర్వం, పొగరు, కుట్రలు, కుతంత్రాలు, వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ సిరీస్ లో చాలా హైలెట్ చేసి చూపించాడు దర్శకుడు. అసలు డబ్బు ఉంటే ఏమైనా చెయోచ్చా.. డబ్బు ఉంటే దేనినైనా సాధించుకోవచ్చా అని ఈ సిరీస్ చూసి వాళ్లకి అనిపించకమానదు.

అసలు స్టోరీ ఏంటంటే.. ఒక కాలేజ్. అయితే అక్కడ అందరూ బిలియనీర్లే చదువుతూ ఉంటారు. ఒక్కొక్కళ్లు కోట్లు ఖరీదు చేసే కార్లలో కాలేజ్ కి వస్తుంటారు. కానీ, హీరోయిన్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆమె స్కాలర్ షిప్ మీద ఆ కాలేజ్ లో చదువుకునేందుకు వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న కోటీశ్వరుల పిల్లలు మాత్రం ఆ అమ్మాయిన కనీసం మనిషిగా కూడా చూడరు. అయితే హీరో కన్ను ఆ అమ్మాయి మీద పడుతుంది. తన కోరిక తీర్చుకునేందుకు ఆమెను లొంగదీసుకోవాలి అని ప్రయత్నిస్తాడు. అందుకు ఆమెకు డబ్బు ఆశ చూపిస్తాడు, తన పొగరు చూపిస్తాడు. కానీ, ఆత్మ గౌరవం కలిగిన ఆ యువతి ఆ డబ్బును హీరో ముఖం మీద విసిరికొడుతుంది. ఆ యువతిని ఎలాగైనా లొంగదీసుకోవాలని హీరో అనుకుంటాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయితో హీరో కోరిక తీర్చుకోవాలని చూశాడా? లేక నిజంగానే ప్రేమలో పడిపోయాడా? అసలు ఆ బిలీయనీర్ల కాలేజ్ లో ఏం జరుగుతుంది? అనే ఇంట్రస్టింగ్ పాయింట్లతో ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. ఈ ట్రెండింగ్ జర్మన్ వెబ్ సిరీస్ మీకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇంకేందుకు ఆలస్యం ఈ వెబ్ సిరీస్‌ని వెంటనే మీరు చూసేయండి మరి.

మరికొన్ని సినీ సంగతులు…

‘లవ్ మీ’మూవీ ట్రైలర్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments