భారత్ సమాచార్, హైదరాబాద్ ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రి కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.విభజన సమస్యలు ఒక్కటే కాకుండా, గత 5 ఏళ్ళు పట్టి పీడించిన డ్రగ్స్, గంజాయి, సైబర్ క్రైమ్స్‌పై కూడా భేటీలో చర్చ. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని, రెండు రాష్ట్రాల ఏడీజీ స్థాయి అధికారులతో డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
కార్యక్రమ ప్రారంభంలో సీఎం రేవంత్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాళోజీ నారాయణ రావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని బహుకరించారు.
‘‘తెలంగాణ రాష్ట్ర సీఎం శ్రీ రేవంత్ కుమార్ రెడ్డి గారితో నేడు హైదరాబాద్ లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాల పై ఈ సమావేశంలో చర్చించాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది.’’- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
‘‘విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సుధీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది.’’ – తెలంగాణ సీఎం రేవంత్ కుమార్ రెడ్డి
‘‘ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించాం. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని కీలక అంశాలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం. ఈ సమావేశంతోనే పరిష్కారాలన్నీ దొరుకుతాయని భావించడంలేదు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ. ఉన్నతస్థాయి అధికారుల కమిటీతో కూడా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మంత్రులతో మరో కమిటీ వేసి పరిష్కరించాలని నిర్ణయించాం.’’ -డిప్యూటీ భట్టి విక్రమార్క
రెండు రాష్ట్రాల సీఎంల మీటింగులో పాల్గొననున్న సభ్యులు
తెలంగాణ తరఫున
రేవంత్ రెడ్డి, సీఏం
భట్టి విక్రమర్క, డిప్యూటీ సీఎం,
పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి
శ్రీధర్ బాబు, మంత్రి
అధికారులు
శాంతి కుమారి, సీఎస్
మరో ఇద్దరు అధికారులు
ఆంధ్ర ప్రదేశ్ నుండి
చంద్రబాబు నాయుడు, సీఏం
మంత్రులు
కందుల దుర్గేశ్
సత్య ప్రసాద్
బీసీ జనార్ధన్ రెడ్డి
ఆఫీసర్లు
నీరబ్ కుమార్, సీఎస్
కార్తికేయ మిశ్రా, ఐఏఎస్
రవిచంద్ర, ఐఏఎస్