భారత్ సమాచార్, చెన్నై ; దేశంలో ఒక వైపు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంటే, మరోవైపు క్రికెట్ ప్రేమికులకి వేసవి వినోదాలు పంచటానికి ఐపీఎల్-17 సీజన్ నేడు అట్టహాసంగా ప్రారంభం అవ్వబోతోంది. సమ్మర్ హాలీడేస్ అంటే ఐపీఎల్ అనేంతలా భాగం అయిపోయింది ఈ పొట్టి క్రికెట్ లీగ్.
చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మొదటి మెగా బిగ్ ఫైట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాలెంజ్ చేస్తోంది. రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకు ముందు సాయంత్రం 6.30 నుంచి భారీగా ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్ తమ ఆటపాటలతో అలరించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ గా నిలవబోతోంది. ప్రముఖ సింగర్ సోను నిగమ్ లైవ్ ఫర్మామెన్స్ ఇవ్వనున్నాడు.
2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ విజేతలు..
అత్యధికంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు
ట్రోఫీ విజేతలుగా నిలిచాయి.
సీజన్ – విజేతగా నిలిచిన జట్టు
2008- రాజస్థాన్ రాయల్స్
2009- డెక్కన్ ఛార్జర్స్
2010- చెన్నై సూపర్ కింగ్స్
2011- చెన్నై సూపర్ కింగ్స్
2012- కోల్కతా నైట్ రైడర్స్
2013- ముంబయి ఇండియన్స్
2014- కోల్కతా నైట్ రైడర్స్
2015- ముంబయి ఇండియన్స్
2016- సన్రైజర్స్ హైదరాబాద్
2017- ముంబయి ఇండియన్స్
2018- చెన్నై సూపర్ కింగ్స్
2019- ముంబయి ఇండియన్స్
2020- ముంబయి ఇండియన్స్
2021- చెన్నై సూపర్ కింగ్స్
2022- గుజరాత్ టైటాన్స్
2023 – చెన్నై సూపర్ కింగ్స్