భారత్ సమాచార్, ఆరోగ్యం : మన దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో సంప్రదాయాలను పాటిస్తాం. వాటిని పాటించక పోతే మన తాత ముత్తాలు, మన అమ్మా నాన్నలు పెద్ద అపచారంగా భావిస్తారు. వాటిని కచ్చితంగా పాటించాలని నేటి జనరేషన్ Z కిడ్స్ ని కూడా తెగ ఇబ్బంది పెడతారు. పెళ్లి అయిన తరువాత నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. కాళ్లకి మెట్టేలు ధరించాలి. మంగళవారం గోర్లు తీయకూడాదు. మగవారు మొలతాడు కట్టుకోవాలని ఇలా రకరకాలుగా చెప్తాతారు. ఆడవారి సాంప్రదాయాల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మగవారు పాటించే అతి కొద్ది సాంప్రదాయంలో ఒకటి మొలతాడు ధరించడం.
మగవారిలో ఈ సాంప్రదాయం ఇప్పటికి కొనసాగిస్తున్నారు. అయితే మగవారు కచ్చితంగా మొలతాడు కట్టుకోవాలని నియమం కూడా ఉంది(అంటే నియమం మన తాత ముత్తాతలు పెట్టుకున్నారు అది వేరే సంగతి) దాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. దీన్నే ప్రస్తుత జనరేషన్లో కూడా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కూడా. అసలు మొలతాడు కట్టుకుంటే ఏం జరుగుతుంది..కట్టుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి.
- మొలతాడు కట్టుకోకపోతే ఏం జరుగుతుంది..?
పుట్టిన చిన్న పిల్లలకు కూడా మొలతాడు కడతారు. అవి పాతబడితే దాన్ని తీసి వేసి కొత్త కడతారు. అసలు మొలతాడు లేకుండా మాత్రం ఉంచరు. ఎందుకని వాళ్లని అడిగితే దరిద్రం..శని..మొలతాడు ఉంటేనే మగాడు అంటారని ఇలా వాళ్లకి తోచినవి చెప్తాతారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో మొలతాడు లేకుంటే చనిపోయనట్లే అని అర్థం ఉంది అంటా. ఇంకా చనిపోయినప్పుడే మొలతాడును తొలగిస్తారంటా. నల్ల రంగు దిస్టి తగలకుండా చేస్తుందని నమ్ముతారు. చెడు శక్తుల నుంచి మనల్ని కాపాడుతుందని గట్టి నమ్మకం. ఏది ఏమైనా ఇవన్నీ మన ఆచారంలో భాగమనే మనం భావించాలి. - మొలతాడు ఎందుకు కట్టుకోవాలి..?
పూర్వం పంచెలు, లుంగీలు లాగులు కట్టుకునేవారు. అయితే అప్పట్లో బెల్టులు అందరికి అందుబాటులో ఉండేవి కావు. అందువల్ల మనం కట్టుకున్న పంచెలు..లింగీలు జారిపోకుండా మొలతాడు కట్టుకునే వాళ్లం. ఇంకా పూర్వం ఆసుపత్రులు..వైద్యులు తక్కువ మంది ఉండేవారు. దీనికి తోడు సరైన రవాణా కూడా లేదు. ఎవరికైనా ఎప్పుడైనా పాము కాటు వేస్తే వెంటనే అందుబాటులో ఉన్న మొలతాడుని తెంపి పాము విషాన్ని పైకి ఎక్కకుండా బిగుతుగా కట్టేవారు. దీని వల్ల పాము విషం శరీర భాగాలకు ఎక్కకుండా ఉంది. దీంతో పాము విషాన్ని వెంటనే తీసేవారు. ఎవరైనా పొరబాటున బావిలోనో..చెరువులోనో..జారి పడి మునిగి పోతే వారిని కాపాడటానికి మొలతాడు ఎంతో సహయపడుతుంది. ఇంకా ముఖ్యంగా మొలధారాలు ఎక్కువగా నల్ల రంగువే కట్టుకుంటారు. అంతే కానీ మొలధారం లేకపోతే దరిద్రం..శని..చనిపోతాడు..ముడ్డదిగుతుంది అని మన పెద్దలు చెప్పే మాటలు అసలు నమ్మకండి. - మొలతాడు ధరించడం మన ఆరోగ్యానికే ప్రమాదం
చిన్నపిల్లలకు ఆరు నెలలు నిండగానే ఎదో కొంపలు అంటుకున్నట్లు వెంటనే మొలతాడు కడతారు. దీని వల్ల రోజూ స్నానం చేపిస్తున్నప్పుడు మొలతాడుకి సబ్బు అంటుకుని అవి అలాగే శరీరాన్ని అంటిపెట్టుకుంటాయి. ఆ తేమ వల్ల పిల్లలకు చర్మవాధ్యులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాను రాను ఆ ధారం బిగుతుగా అవుతంది. దీని వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని వల్ల పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా చిన్నప్పటి నుంచి ధారం కట్టి..కట్టీ మనం నడుంకి చెరిగిపోని మచ్చలు కూడా పడతాయి. దాని వల్ల భవిష్యత్తులో రక్త ప్రసరణ సరిగ్గా జరగక క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పటికైనా పాతకాలపు అవాట్లకు స్వస్తి చెప్పండి. ప్రస్తుతం రకరకాల బెల్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ధరించడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి ఎంతో సౌకర్యంగా, సౌంధర్యంగా కూడా ఉంటుంది.