భారత్ సమాచార్ ; తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ సీట్లే లక్ష్యంగా బీజేపీ కేంద్ర అధిష్ఠానం భారీ స్థాయిలో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. సౌత్ లో కర్ణ్నాటక తర్వాత కాషాయ పార్టీకి పొలిటికల్ గా కొంత పట్టు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇక్కడ గట్టిగా పాతుకుపోవాలని ఎప్పటి నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలను అమలు పరుస్తోంది. ప్రత్యేకంగా తెలంగాణలో పొలిటికల్ కన్సల్టెన్సీలతో పాటుగా, సొంతంగా సర్వేలు చేసుకొని మరి పార్టీ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ చివరి ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్న, ప్రచారానికి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా మోడీ, అమిత్ షా వంటి అగ్రనాయకులు వరుస పెట్టి మరి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
పార్టీ తరపున అభ్యర్థులు కూడా తమదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వరుస పెట్టి హామీలు ప్రకటిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో ని కాకుండా ఒక్కో పార్లమెంట్ స్థానానికి ప్రత్యేక మేనిఫెస్టో ను రూపొందిస్తున్నారు. మిగిలిన పార్టీల అభ్యర్థులతో పోలిస్తే విభిన్న శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ “మోదీ గ్యారెంటీ – ఈటల షూరిటీ” పేరుతో తను పోటీ చేసే మల్కాజిగిరి పార్టమెంట్ స్థానానికి 7 గ్యారెంటీలతో కూడిన ప్రత్యేక మ్యానిఫెస్టో ను ప్రకటించారు. దీనికి విజన్ ఫర్ మల్కాజిగిరి అని పేరు పెట్టారు. ఇందులో ఉన్న అంశాలు ఇవే.
విజన్ ఫర్ మల్కాజిగిరి..
1 – వికసిత్ మల్కాజిగిరి.
2 – స్వచ్ఛ మల్కాజిగిరి.
3 – నైపుణ్య/స్కిల్డ్ మల్కాజిగిరి.
4 – ఆరోగ్య/అయుష్మాన్ మల్కాజిగిరి.
5 – ఆత్మనిర్భర నారీ శక్తి మల్కాజిగిరి.
6 – డిజిటల్/ఐటి ఆధారిత మల్కాజిగిరి.
7 – మేక్ ఇన్ మల్కాజిగిరి.