Date and Time

Email : bharathsamachar123@gmail.com

Pm Modi: గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్, చెన్నై: చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోది శనివారం తమిళనాడులోని తూత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించడమే కాకుండా.. రాష్ట్రంలో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు మోదీ.

 

శనివారం రోజు రాత్రి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వెళ్లిన మోదీ.. అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం అరియలూర్ జిల్లాలోని గంగైకొండ చోళపురానికి బయలుదేరి వెళ్లారు. రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. స్వామివారి దర్శనానికి ప్రధాని మోదీ సంప్రదాయ పంచెకట్టులో వచ్చారు. స్వామివారికి గంగా జలంతో అభిషేకించి.. ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ.

 

ఇక అంతకుముందు ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించి.. ఆశీర్వచనాలు అందించారు పండితులు. ఇకపోతే తెల్లటి ధోతి, చొక్కా, మెడలో అంగవస్త్రం ధరించి సంప్రదాయ పంచెకట్టులో ఉన్న ప్రధాని మోదీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు గంగైకొండ చోళపురానికి వచ్చిన మోదీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు.

Share This Post