Homemain slidesత్వరలో కశ్మీర్‌కు మోడీ.. మళ్లీ అందుకేనా..?

త్వరలో కశ్మీర్‌కు మోడీ.. మళ్లీ అందుకేనా..?

భారత్ సమాచార్, జాతీయం: త్వరలో దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ  జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర సందర్శనకు వెళ్లనున్నారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌లో ఇప్పుడు పర్యటించనున్నారు. శివరాత్రికి ఒక్క రోజు ముందు మార్చి 7వ తేదీన కశ్మీర్‌ పర్యటనకు వెళుతున్నారు నరేంద్ర మోదీ.  శ్రీనగర్‌లో జరిగే ప్రజా సభలో ప్రజలనుద్దేశించి  ప్రసంగించనున్నారు. అంతేకాక, పలు కేంద్ర పథకాలను కూడా ప్రారంభించనున్నట్లు మీడియాకు సమాచారం అందించారు.

అతి దగ్గరల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ కశ్మీర్‌ పర్యటన దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సరికొత్త కశ్మీర్‌ తాము సాధించిన గొప్ప విజయంగా బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకోనున్నట్టు రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కశ్మీర్‌లో ఉన్నాతాధికారులు ఇప్పటికే భద్రత పరంగా హైఅలర్ట్‌ను‌ ప్రకటించారు. శ్రీనగర్‌లో సభా వేదిక కూడా నిర్ణయం కావడంతో పోలీసులు, పారామిలటరీ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు స్థానిక పోలీసులు. సభావేదిక పరిసరాలను పారామిలటరీ బలగాలు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కశ్మీర్ లో కాషాయ పార్టీ పాగా వేసేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్టు సీనియర్ రాజకీయ వేత్తలు చెబుతున్నారు. అయితే ఈ ప్రణాళికలు పూర్తి స్థాయిలో అమలు కావటానికి ఇంకో రెండు దశాబ్దాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కశ్మీర్ ప్రజల మనసు  గెలవటానికి బీజేపీ పార్టీ కి అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

కులం కంపు.. స్వార్థ రాజకీయాలు.. ఇదే మన దేశ అభివృద్ధి

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments