భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపెల్లి ముత్తేష్, జాతీయ గౌరవ అధ్యక్షుడు నిజాముద్దీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి చందా శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే.రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు.
మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి:
న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ జర్నలిస్టులు కోరుతున్నారు. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడిని నిరసిస్తూ బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శాంతియుత నిరసనకు జర్నలిస్టులు పిలుపునిచ్చారు.