Homemain slidesఅతి ఎక్కువ మంది వెతికింది ఈ అమ్మడి గురించే!

అతి ఎక్కువ మంది వెతికింది ఈ అమ్మడి గురించే!

భారత్ సమాచార్, సినీ టాక్స్ : సోషల్ మీడియా ప్రభావం స్టార్ట్ అయిన తర్వాత జనాలకు అంతా ఈజీ అయిపోయింది. వారికేది కావాలన్నా గూగుల్ లో వెతికి తెలుసుకుంటున్నారు. పెద్దగా చదువులేకున్నా సరే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో యమ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా ఇండియాలో అత్యధిక మంది సెర్చ్ చేసిన హీరోయిన్లలో మన బాలీవుడ్ కమ్ టాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ అందరి కంటే కూడా ముందుంది.

గూగుల్ సెర్చ్ ఇంజిన్  ఈ ఏడాది ‘‘మోస్ట్ సెర్చ్ డిటెయిల్స్’’ ను అధికారికంగా ఈ మధ్యనే రిలీజ్ చేసింది. యాక్టర్స్, ఫిల్మ్స్, న్యూస్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్.. ఇలా పలు విభాగాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న యాక్టర్స్, ప్రోగ్రాంల జాబితాలను నెట్టింట విడుదల చేసింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా మోస్ట్ సెర్చ్ డ్ ఫిల్మ్ యాక్టర్ గా ఎవరూ ఊహించని హీరోయిన్ నిలిచింది. ‘బార్బీ’ భామ మార్గోట్ రాబీ, ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ నటి గాల్ గాడోట్, గ్లోబల్ ఫేమ్ ఉన్న ఇండియన్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పడుకోనే, ఆలియా భట్ ను బీట్ చేసి కియారా అద్వానీ అందరి కంటే కూడా ముందంజలో ఉండడం విశేషం.

ఈ ఏడాది మొదట్లోనే సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి, ఆ వెంటనే ‘సత్య ప్రేమ్ కీ కథ’ సినిమా రిలీజ్ ఆమె ముందంజలో ఉండడానికి కొంచెం హెల్ప్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత ‘కాఫీ విత్ కరణ్’ షో గెస్ట్ గా హాజరుకావడం.. రామ్ చరణ్ ‘‘గేమ్ చేంజర్’’, హృతిక్-ఎన్టీఆర్ మూవీ ‘వార్-2’లో నటిస్తుండడంతో నెటిజన్లు ఎక్కువగా ఆమె కోసం గూగుల్ లో సెర్చ్ చేశారు. ఇవన్నీ ఆమెకు కలిసి వచ్చి టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

మరికొన్ని కథనాలు…

టూ మచ్ హాట్ గా కియారా…

RELATED ARTICLES

Most Popular

Recent Comments