PM Modi: అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత్ ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ దేశాధినేత ర్యాంకింగ్ లిస్ట్‌లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచి మరోసారి రికార్డు సృష్టించారు. యూఎస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ నాయకులలో అత్యధిక రేటింగ్‌ను మోదీ సొంతం చేసుకున్నారు.

 

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, విశ్వసనీయమైన నాయకుడిగా ప్రధాని మోదీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని పేర్కొంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ ర్యాకింగ్స్‌లో 75 శాతం మంది ప్రధాని మోదీకి మద్దతు తెలపారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండగా.. సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మైయుంగ్ 50 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు.

 

ఇక అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలే మూడో స్థానంలో నిలవగా.. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నాలుగో స్థానం, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నేతగా మోదీ ఇప్పటికే అనేక సార్లు ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.

Share This Post