Homemain slidesమాతృదేవోభవ...

మాతృదేవోభవ…

భారత్ సమాచార్, ‘అక్షర’ప్రపంచం;

మానవ నాగరికతకు మూలం కుటుంబం అయితే, ఆ కుటుంబానికి ఆయువు అమ్మ. ఏ కాలంలో నైనా, ఏ సమాజంలో నైనా తల్లి ప్రేమకు ఏదీ సాటి రాలేదు. కుటుంబంలో అమ్మ బాధ్యతకు స్థానం చెదరలేదు.

ప్రతి రోజూ కూడా అమ్మ పై ప్రేమను తెలుపుతూ ఉంటాం కానీ, సంవత్సరానికి ఒక్క రోజు మాత్రం అందరూ కలిసి అమ్మ కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మతాలకతీతంగా మదర్స్ డే వేడుకలను జరుపుకుంటున్నాం. దాదాపుగా శతాబ్దం ముందు నుంచి కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను మొదటగా అమెరికాలో నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకు అన్నా జార్విస్ అనే మహిళ స్ఫూర్తి. 1907 మే 12న అమెరికన్ మహిళ అన్నా జార్విస్ తన తల్లి కోసం ఒక మెమోరియల్ సర్వీస్ నిర్వహించడంతో మదర్స్‌ డే అనే ఆలోచన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఏటా మే నెలలో రెండో ఆదివారం నాడు అమ్మను గుర్తు చేసుకునేందుకు కొన్నికార్యక్రమాలు చేయడం మొదలైంది. దీంతో 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు దీన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

తల్లి ఇతరుల జీవితాలు మెరుగుపడేలా అమ్మలు చేసే పనికి గుర్తింపు దక్కాలని, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది కోరుకున్నారు. అన్నా జార్విస్ మాత్రం ‘అత్యుత్తమ మాతృమూర్తి ఎవరైనా సరే ఆమె మీకు తల్లే’ అనే భావనతో ఈ మదర్స్ డేను జరపడం ప్రారంభించారు.‘తన జీవితాన్ని మీ కోసం అంకితం చేసిన మీ తల్లిని గౌరవించే రోజు ఇది’ అనేది అన్నా జార్విస్ అభిప్రాయం.

ఈ రోజే ఎందుకు?

1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే నిర్వహించారు. అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణం.

ఇండియాలో మదర్స్‌ డే

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లే భారత దేశంలోనూ మే నెల రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు, విదేశాల్లో ఉండే వారు, ఈ ప్రత్యేక రోజులో అమ్మకు శుభాకాంక్షలు తెలపడం, విదేశాల నుంచి ఫోన్లు చేసి మాట్లాడటం, బహుమతులు పంపించడం వంటి సంస్కృతి ఇప్పుడు భారత దేశంలో పెరుగుతోంది. ప్రస్తుత ఇంటర్ నెట్ యుగంలో దేశంలోని మెట్రో నగరాల్లో మదర్స్ డే రోజున కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట భోజనం చెయ్యడం, ఇంట్లో అందరూ కలిసిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటం పరిపాటిగా మారుతోంది.

ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చిన సరే భారతదేశంలో తల్లులు- పిల్లల మధ్య ఉండే అనుబంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు యుక్త వయసు వచ్చే వరకు కూడా తల్లితోనే ఎక్కువ సమయం గడుపుతారు. దీంతో వారి మధ్య ఎక్కువ అనుబంధం ఏర్పడటానికి అవకాశం దొరుకుతుంది.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

తల్లిదండ్రులకు వేసవి సెలవుల హోంవర్క్

RELATED ARTICLES

Most Popular

Recent Comments